కరోనా వైరస్ బలహీనపడుతోందా?

  • Publish Date - August 19, 2020 / 12:52 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది.. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడంలో నిమగ్నమయ్యాయి. 2020 ఏడాదంతా కరోనా వైరస్ గుప్పిట్లో బతుకీడుస్తోంది.. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకడంతో ఇప్పటివరకు 22 మిలియన్ల మంది వైరస్ బారినపడ్డారు.

కరోనా సెకండ్ వేవ్ రెండు దేశాలను వణికిస్తోంది.. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. ఈ రెండు దేశాలను సురక్షితమైన దేశాల జాబితా నుంచి తొలగించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.ఈ రెండు దేశాల నుంచి యూకే వచ్చే వారందరిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతున్నారు.



కానీ, మొదట్లో ప్రాణాంతక కరోనా వైరస్‌లో కనిపించినంత తీవ్రత ఇప్పుడు లేదని అంటున్నాయి అధ్యయనాలు.. మ్యుటేషన్ కారణంగా కరోనా వైరస్ మరింత బలహీనపడుతుందని చెబుతున్నాయి.. వాస్తవానికి కరోనా వైరస్ బలహీనపడుతుందా? అంటే.. అవుననే అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కరోనా వైరస్ బలహీనపడటానికి పలు కారణాలను సూచిస్తున్నాయి.. గత జూన్ నెలలో ఇటలీ నుంచి వచ్చి ఓ ఢాక్టర్ కరోనా వైరస్ దానంతంట అదే అంతమైపోతుందని అభిప్రాయపడ్డారు.. కరోనా వైరస్ కోసం ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదన్నారు. 80ఏళ్లు లేదా 90 ఏళ్ల కరోనా రోగుల్లో కూడా ఎలాంటి తీవ్రమైన లక్షణాలు కనిపించడం లేదన్నారు.



వారికి వారే మంచంపై కూర్చుంటున్నారని, ఎవరి సాయం లేకుండానే శ్వాస తీసుకోగలుగు తున్నారని అన్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఇదే వయస్సు కరోనా రోగులు రెండు, మూడు రోజుల్లో చనిపోయేవారుని ఆయన చెప్పారు.



అయితే ఈ వాదనలను ఇతర నిపుణులు వివాదాస్పదమయ్యాయి. కొలంబియా యూనివర్శిటీ డాక్టర్ Angela Rasmussen ప్రకారం.. వైరస్ శక్తిని కోల్పోతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. Glasgow యూనివర్శిటీ డాక్టర్ ఆస్కార్ మాక్లీన్ మాట్లాడుతూ.. మ్యుటేషన్ కారణంగా వైరస్ బలహీనపడితే సిద్ధాంతపరంగా సాధ్యమే అన్నారు. మ్యుటేషన్‌తో కరోనా వైరస్ బలహీనపడుతుందా అనేదానిపై ధృవీకరించాల్సిన అవసరం ఉంది.