Lose Fat : కొవ్వులు కరగాలంటే వారంలో ఒకరోజు కేలరీలు తగ్గిస్తే సరిపోతుందా?

ఉపవాసం మీ హార్మోన్లను అదుపులో ఉంచుతుంది. రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. తక్కువ తినడం వల్ల మెదడు చురుకుగా ఉండి తెలివిగా వ్యవహరించేందుకు అవకాశం ఉంటుంది.

Lose Fat : అధిక బరువు, కొవ్వు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. దీనికి ముఖ్యకారణం జీవనశైలి, ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణం. అధిక బరువు, కొవ్వు సమస్య నుండి బయటపడేందుకు చాలా మంది వివిధ రకాల పద్దతులను అనుసరిస్తుంటారు. అయితే వాటిలో కొన్ని సత్ ఫలితాలను ఇస్తుంటే మరికొన్నింటి వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించదు. ఈ క్రమంలో వారానికి ఒకరోజు ఉపవాసం చేయటం వల్ల శరీరంలో అదనపు కొవ్వులను కరిగించటంతోపాటు బరువును సులభంగా తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఉపవాసం మీ హార్మోన్లను అదుపులో ఉంచుతుంది. రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. తక్కువ తినడం వల్ల మెదడు చురుకుగా ఉండి తెలివిగా వ్యవహరించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్‌ పెంచేందుకు తోడ్పడుతుంది. వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారంలో ఒకరోజు ఉపవాసంతో రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే ఈ కొలెస్ట్రాల్ చాలా త్వరగా తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం వలన బీపీ, గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు.

శరీరంలో కొవ్వులు పేరుకోవటానికి ముఖ్యకారణం అధికంగా నూనెతో కూడిన పదార్దాలు, జంక్ ఫుడ్స్ రోజువారిగా తీసుకోవటమే. వీటికారణంగా అధిక బరువు సమస్య ఎదురవుతుంది. అదే క్రమంలో ఉపవాసంతో పాటు రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించటం వల్ల శరీరంలోని కొవ్వులు కరిగి కొత్త శక్తి వస్తుంది. అంతేకాకుండా వివిధ రకాల చర్మ సంబంధ సమస్యలను నుండి ఉపశమనం కలుగుతుంది. ఉపవాసం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. అనారోగ్యాలు దరిచేరవు. శరీరంలో చురుకుదనం, ఉత్సహాయం పెరుగుతాయి.

 

ట్రెండింగ్ వార్తలు