Diet Necessary For Health : ఆరోగ్యం కోసం ఆహారం తప్పనిసరా? ఏయే ఆహారాలు శరీరానికి అవసరమంటే?
శరీరంలో జరగాల్సిన, కార్యక్రమాల క్రమబద్ధీకరణకు ఆహారం అవసరమౌతుంది. గుండె కొట్టుకోవటం, కండరాల సంకోచవ్యాకోచాలు, నీటి సమతుల్యాన్ని కాపాడటం, రక్తం గడ్డ కట్టటం, శరీరం నుంచి వ్యర్థపదార్థాల్ని తొలగించటం మొదలెైనవి.

Is diet necessary for health? What foods do the body need?
Diet Necessary For Health : ఆరోగ్యం విషయంలో ఆహారం పోషించే పాత్ర అంతాఇంతా కాదు. మన శరీరం ఒక యంత్రంగా భావిస్తే దానికి ఇంధనం లాంటిదే ఆహారం. ఈ ఇంధనం లేకుంటే మనిషి శరీరమనే యంత్రం పనిచేయదు. యంత్రం నిరంతరం పనిచేయాలంటే ఇంధనం ఏవిధంగా అందించాలో మన శరీరం సక్రమంగా విధులు నిర్వర్తించాలంటే ఆహారాన్ని అందించాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మంచి పోషకాహారాలను అను నిత్యం తీసుకోవాలి.
శరీర నిర్మాణానికి, శక్తి కోసం ఆహారం ;
ఆహారం మన శరీర నిర్మాణానికి ఉపకరిస్తుంది. పుట్టిన పాపాయి పెరిగి పెద్దగా అవ్వాలంటే వారి వారి వయస్సును బట్టి తగినంత ఆహారం తీసుకుంటూ ఉండాలి. పుట్టిన దగ్గరనుంచి పెరిగి పెద్దయేదాకా మీరు ప్రతిరోజు ఆహారాన్ని సరెైన పరిమాణంలో తీసుకుంటే అది మీ శరీరంలో అరిగిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణాల్ని నిర్మించుతూ, మీ శరీరం సక్రమమైన క్రమంలో ఎదిగేందుకు తోడ్పడుతుంది. శరీరం రోజువారి విధులు నిర్వర్తించటానికి కావాల్సిన శక్తిని అందించటానికి ఆహారం ఉపయోగపడుతుంది.
శరీరంలో జరగాల్సిన, కార్యక్రమాల క్రమబద్ధీకరణకు ఆహారం అవసరమౌతుంది. గుండె కొట్టుకోవటం, కండరాల సంకోచవ్యాకోచాలు, నీటి సమతుల్యాన్ని కాపాడటం, రక్తం గడ్డ కట్టటం, శరీరం నుంచి వ్యర్థపదార్థాల్ని తొలగించటం మొదలెైనవి. శరీరం సక్రమంగా ఆరోగ్యంతో ఉండాలన్నా, శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చుకోవాలన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన సమతుల్యాహారాన్ని క్రమంగా తీసుకొంటూ ఉండాలి.
శరీరానికి ఎలాంటి ఆహారాలు అవసరమౌతాయి;
శరీర రోజువారి విధులకోసం కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్‌లు, ఖనిజ లవణాలు, నీరు, పీచు పదార్థం, తీసుకోవాలి. రోజువారిగా సమతులాహారం తీసుకోవాలి. పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే శరీరానికి దాని వల్ల ప్రయోజనం కలుగుతుంది. శరీరంలోకి ప్రవేశించే హానికారక బ్యాక్టీరీయాలతో పోరాడే శక్తి శరీరానికి అందుతుంది. కొన్ని ఆహార పదార్థాలలో ఎక్కువ పోషక విలువలు, మరికొన్నింటిలో తక్కువ పోషక విలువలు ఉంటాయి. శరీరారోగ్యానికి అవసరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఆహారాన్ని తీసుకోవాలి.
శరీరంకోసం పండ్లను తీసుకోవాలి వీటిలో కొవ్వు, ఉప్పు తక్కువగా ఉంటాయి. విటమిన్‌లు ఎ,సిలు అధికంగా లభిస్తాయి. పొటాషియం, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా లభించటమే కాక ఫెైబర్ అధికంగా లభిస్తుంది. వీలెైనప్పుడల్లా తాజా పళ్ళను తినటం మంచిది. కాయగూరల్లో కొవ్వు తక్కువగానూ, ఎ, సి విటమిన్‌లు ఎక్కువగానూ లభిస్తాయి. ఫైబర్, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. మాంసం, చేపలు, చికెన్, గుడ్లు, జీడిపప్పు, ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. కొవ్వు అధికంగా ఉండే వాటి పట్ల జాగ్రత్తలు పాటించాలి.
పాలు,పెరుగు,వెన్నవంటి డెైరీ ఉత్పత్తులలో కాల్షియం, ప్రొటీన్‌లు, విటమిన్‌లు, కొన్ని ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. వాటిని తక్కువగా వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఆహారం తీసుకోకపోవటం, తీసుకున్నా వాటిలో సరైన పోషకాలు లేకపోవటం వల్ల అంతర్గతావయవాలు, కండరాలు,క్రమేపీ దెబ్బతింటాయి. తద్వారా సులభంగా వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనిషి జీవితం సాఫీగా సాగాలంటే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోవాలి.