Porridge : గంజి తాగటం ఆరోగ్యానికి మంచిదా?

నీటిలో కొంచెం గంజిని కలిపి స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. గంజిలో బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంటతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.

Ganji

Porridge : ప్రతిరోజు గంజితాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వకాలంలో అన్నం వండే సమయంలో వచ్చే గంజిని ఆరోగ్యానికి మేలు చేసేదిగా భావించి సేవించేవారు. అయితే ప్రస్తుతం చాలా మంది గంజిని తాగటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. అయితే అదే క్రమంలో పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళల్లో సూప్ ల పేరుతో సర్వ్ చేస్తున్న గంజిని మాత్రం లొట్టలేసుకుంటూ తాగేస్తున్నారు. అదే ఇంట్లో అన్నం వార్చే సమయంలో వచ్చే గంజిని తాగటానికి మాత్రం ఆసక్తి చూపటంలేదు. వాస్తవానికి గంజి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం గంజిని అస్సలు వదిలిపెట్టరు. గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగితే ఆటేస్టే వేరు. బియ్యంలో ఉండే పోషకాలేవీ బయటకు పోకుండా శరీరానికి చక్కగా అందుతాయి. గంజి వల్ల కలిగే ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే గంజిని ఇష్టంగా తాగేస్తారు.

ముఖంపై గుంతలు ఏర్పడకుండా ఉండాలంటే గంజిని తీసుకోండి. ఇది, శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకుని తాగండి. కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరాన్ని ఇది కూల్‌గా ఉంచుతుంది. జ్వరం వచ్చిన సందర్భంలో ఇది తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పట్టేందుకు సహకరిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.

గంజిలో అమైనో అమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండలు పెంచేవారికి ఉపయోగపడతాయి. ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. తలకు పట్టిస్తే.. జుట్టు పట్టులా మెరుస్తుంది. ఇందులో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. హెయిర్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల పొడవైన, ఆరోగ్యకరమైన కురులు మీ సొంతమవుతాయి. జుట్టు రాలే సమస్యను కూడా గంజి అరికడుతుంది. అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

నీటిలో కొంచెం గంజిని కలిపి స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. గంజిలో బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంటతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. ఇందులోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు కాస్త ఇది తాగితే ఉత్సాహం వస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. వాంతులు, విరేచనాలతో బాధపడేవారు దీనిని ఆహారంగా తీసుకుంటే పోషకాలు అందుతాయి. ఇది డయేరియాను తగ్గించడమే కాకుండా ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.