Eating Fish : శీతాకాలంలో చేపలు తినటం ఆరోగ్యానికి మంచిదేనా?

డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న‌వారు చేప‌ల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

Fish

Eating Fish : చ‌లికాలం రోగాలకు నిలయం. అనేక రోగాలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈ కాలంలో ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. వాతావ‌ర‌ణంలో తేమ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక బాక్టీరియా, ఇత‌ర సూక్ష్మ జీవులు సుల‌భంగా వృద్ధి చెందుతాయి. దీంతో మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లను క‌ల‌గ‌జేస్తాయి. అందువ‌ల్ల ఈ సీజ‌న్‌లో ఆరోగ్య‌క‌ర‌మైన‌, పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో బాక్టీరియా, ఇత‌ర సూక్ష్మ జీవుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

శీతాకాలంలో వ్యాధుల నుంచి ర‌క్షించేందుకు చేప‌లు బాగా ప‌నిచేస్తాయి. ఈ సీజ‌న్‌లో చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ర‌క్షిస్తాయి. ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ వంటి వాటి నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. క‌నుక చ‌లికాలంలో చేప‌ల‌ను త‌ర‌చూ తింటుండాలి. చేపల్లో 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మనం ఆరోగ్యవంతంలా ఉండేలా చేస్తాయి.

చ‌లికాలంలో చ‌ర్మం స‌హ‌జంగానే పొడిగా మారుతుంది. అయితే చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మంపై ర‌క్ష‌ణ పొర‌ను ఏర్పాటు చేస్తాయి. దీంతో చ‌ర్మం పొడిబార‌కుండా సుర‌క్షితంగా, మృదువుగా ఉంటుంది. ఆర్థ‌రైటిస్‌, గౌట్ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి చ‌లికాలంలో స‌హ‌జంగానే ఆ నొప్పులు ఎక్కువ‌వుతుంటాయి. అందువ‌ల్ల వారు చేప‌ల‌ను తినాలి.

చ‌లికాలంలో హార్ట్ ఎటాక్ ల బారిన ప‌డి చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక చేప‌ల‌ను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ముందుగానే అడ్డుకోవ‌చ్చు. చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీంతోపాటు నొప్పుల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. క‌నుక చేప‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే. నిపుణులు చెబుతున్న ప్ర‌కారం, చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మెద‌డు, క‌ళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతోపాటు గ‌ర్భిణీల‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి.

డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న‌వారు చేప‌ల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. చ‌లికాలంలో మ‌న‌కు సూర్య‌ర‌శ్మి స‌రిగ్గా ల‌భించ‌దు క‌నుక చేప‌ల‌ను తింటే విట‌మిన్ డి పుష్క‌లంగా ల‌భిస్తుంది. దీనివ‌ల్ల విట‌మిన్ డి లోపం ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు క‌ళ్లకు ఎంత‌గానో మేలు చేస్తాయి. క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అందువ‌ల్ల చేప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి.

పిల్లల్లో అస్తమాను నివారించేందుకు చేపలు ఔషధంగా పనిచేస్తాయి. చేపలు దృష్టిని మెరుగుపర్చడంతోపాటు, నిద్ర సమస్యలను దూరం చేస్తాయి. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చేపలు తింటే మంచిది. చేపల్లోని ఐరన్.. రక్తంలో హిమోగ్లోబిన్‌ సరిపడా ఉండేలా చేస్తుంది. పేగుల్లో గ్యాస్ ఇతరత్రా సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి. శరీర ఉష్ణోగ్రతను చేపలు క్రమబద్ధీకరించటంతోపాటు శక్తిని అందిస్తాయి. చేపల్లో ఉండే జింక్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.