Hashimoto Disease : హషిమోటో థైరాయిడైటిస్‌ పురుషుల కంటే మహిళల్లోనే అధికమా ?

థైరాయిడ్‌ గ్రంథికి వ్యతిరేకంగా సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేయడం వల్ల 'థైరాక్సిన్‌' హార్మోన్‌ స్రావాలు తగ్గుతాయి. దీని ఫలితంగా సరిపోయినంత థైరాక్సిన్‌ విడుదలకాక జీవక్రియల్లో సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

Hashimoto's thyroiditis

Hashimoto Disease : మన దేహంలో మెడ దగ్గర సీతాకోకచిలుక ఆకృతిలో ఓ కీలకమైన థైరాయిడ్‌ గ్రంథి ఉంటుంది. దీనినే థైరాయిడ్ గ్రంధి అంటారు. ఇది శరీరంలోని అనేక రకాల జీవక్రియలకు అవసరమైన థైరాక్సిన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఇది థైరాక్సిన్ హార్మోన్ ను విడుదల చేయకపోతే జీవక్రియలు మందగిస్తాయి. ఇది హైపో థైరాయిడిజమ్‌కు దారితీస్తుంది. హైపోథైరాయిడిజమ్‌లోనే ఒక రకమైన సమస్యనే హషిమోటో థైరాయిడైటిస్‌ గా పిలుస్తారు.

READ ALSO : Gluten : గోధుమ పిండితో తయారైన ఆహారాలు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయా ?

థైరాయిడ్‌ సమస్య అనగానే హైపర్‌ థైరాయిడిజమ్, హైపో థైరాయిడిజమ్‌ల గురించి మాత్రమే చాలా మందికి తెలుసు. వాస్తవానికి హషిమోటో థైరాయిడైటిస్‌ అనేది కూడా హైపో థైరాయిడిజమ్‌లోని ఒక సమస్యగా చెప్పవచ్చు. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థే తమపై ప్రతికూలంగా పని చేయడం వల్ల వచ్చే ఒక రకం ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌గా నిపుణులు చెబుతున్నారు.

థైరాయిడ్‌ గ్రంథికి వ్యతిరేకంగా సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేయడం వల్ల ‘థైరాక్సిన్‌’ హార్మోన్‌ స్రావాలు తగ్గుతాయి. దీని ఫలితంగా సరిపోయినంత థైరాక్సిన్‌ విడుదలకాక జీవక్రియల్లో సమస్యలు ఉత్పన్నం అవుతాయి. జన్యుపరమైన కారణాలు, అలాగే హార్మోన్‌ స్రావాల లోపాల వల్ల హషిమోటో థైరాయిడైటిస్‌ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Vangaveeti Radha Krishna : పెళ్లి పీటలెక్కనున్న వంగవీటి రాధాకృష్ణ .. అమ్మాయి ఎవరంటే..

థైరాయిడ్‌ బాగా పని చేయాలంటే అయోడిన్‌ అవసరమౌతుంది. ఆహారంలో అయోడిన్‌ లేని ఉప్పు వాడకం కారణంగా ఈ సమస్య వస్తుంది. రేడియేషన్‌లకు గురికావడం, గడ్డ లేదా క్యాన్సర్‌ కణితి రావడంతో, దాన్ని తొలగించడం కారణంగా హైపోథైరాయిడిజమ్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే క్రమంలో హషిమోటో థైరాయిడైటిస్‌లో థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో మార్పులు కనిపిస్తాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. వేర్వేరు వయస్సులను బట్టీ లక్షణాలు కనిపిస్తాయి.

READ ALSO : Groundnut Cultivation :వేరుశనగ పంటకు చీడపీడల బెడద.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

లక్షణాలు ;

మెడదగ్గర ఉండే థైరాయిడ్‌ గ్రంథిలో వాపు వల్ల మెడ ముందుభాగం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు లోపిస్తే స్థూలకాయం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊహించని విధంగా బరువు పెరుగుతారు. నీరసం, నిస్సత్తువ, తీవ్రమైన అలసట, ముఖం ఉబ్బరం, కండరాలు, కీళ్ల నొప్పులు , మలబద్ధకం, సంతానలేమి, నెలసరి సరిగా రాకపోవటం, రక్తస్రావం అధికంగా ఉండటం, జుట్టు రాలటం, గుండె స్పందనల్లో తేడాలు, మానసిక పరమైన సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమస్య నిర్ధారణకు టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ పరీక్ష లు చేయించుకోవాలి. వాటిలో వ్యాధి నిర్ధారణ అయితే వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ చికిత్స పొందాలి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమచారం అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే . వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు