Is it good to eat mushrooms frequently to avoid protein deficiency?
Mushrooms : ఆరోగ్య పరంగా పుట్టగొడుగులు బోలెడన్ని ప్రయోజనాలు అందిస్తాయి. పుట్టగొడుగుల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.
పుట్టగొడుగుల్లో ఉండే ఎర్గోథియోనిన్ అనే అరుదైన యాంటీ ఆక్సిడెంట్ డిప్రెషన్ నుంచి విముక్తిని కలిగిస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలను సైతం పోగొడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి పోతుంది. గుండె ఆరోగ్యంగా మార్చేందుకు తోడ్పడతాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మధుమేహం నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది.
రక్తపోటు ఉన్నవారు, బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు శాతం తక్కువ ఉండటం వల్ల బరువు పెరుగుతామన్న భయమే ఉండదు. ఊబకాయంతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. వీటిలో ఉండే బి విటమిన్లు మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపకరిస్తాయి.
గర్భిణీలకు మష్రూమ్ మంచి ఆహారం. బ్రెస్ట్ కాన్సర్ ను తగ్గిస్తున్నాయి. బాడీలో కొత్త కణాలు పెరిగేలా చేస్తాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలోని బీటా గ్లుకాన్ అనే చక్కెర పదార్థం కూడా రోగనిరోధక శక్తి పెరగటంలో సహాయపడుతుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉండాలంటే పుట్టగొడుగులను వారంలో ఒకసారైన తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పుట్టగొడుగులలో సహజసిద్ధమైన ఇన్సులిన్, ఎంజైమ్స్ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం నుండి షుగర్స్ ను విడగొడతాయి. దీంతో షుగర్ లెవల్స్ పెరగకుండా చూడవచ్చు. అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు సహాయకారిగా తోడ్పడతాయి.