Eat Sprouts : ఆరోగ్యానికి మొలకలు తినటం మంచిదా!..

మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.శరీరంలోని మెటబాలిజం ని పెంచటంతోపాటుగా,టాక్సిన్స్ ని తొలగించడానికి దోహదం చేస్తాయి.

Sprouts

Eat Sprouts : మొలకెత్తిన గింజలను తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు కొద్ది మొత్తంలో మొలకలను తినటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందుతాయి. మొలకల్లో విటమిన్ ఏ, కె, సి, బి, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, క్యాల్షియం వంటివి సమృద్దిగా లభిస్తాయి. వీటిని తిన్నందు వల్ల కేలరీలు పెరగవు.

వీటిని తినటం వల్ల కడుపు నిండిన బావన కలుగుతుంది. బరువు తగ్గేందుకు మొలకలు ఎంతగానో ఉపయోగపడతాయి. మొలకలలో అధిక శాతం మాంసంకృత్తులు ఉంటాయి. మొలకల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఫ్రీరాడికల్స్ ను అడ్డుకొని జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.పురుషుల్లో వచ్చే బట్టతల ను నివారిస్తుంది.

మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.శరీరంలోని మెటబాలిజం ని పెంచటంతోపాటుగా,టాక్సిన్స్ ని తొలగించడానికి దోహదం చేస్తాయి. యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి,మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

షుగర్ తో బాధపడుతున్న వారు మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర స్దాయిలు అదుపు లో ఉంటాయి. టైప్-2 మధుమేహం వున్నా వాళ్లకి గ్లూకోజ్ స్దాయిలను మెరుగుపరుస్తుంది. చిక్కుడు, బఠానీ, పెసలు, సోయాబీన్స్, బాదం, గుమ్మడివిత్తులు, పొద్దు తిరుగుడు, శనగలు, ఇలాంటి వాటిని మొలకలుగా చేసుకుని తినవచ్చు. రాత్రంతా నీటిలో నానబెట్టి తరువాత ఓ గుడ్డలో మూటకట్టుకోవాలి. ఆతరువాత అవి మొలకెత్తే దశకు చేరుతాయి.

విత్తు మొలకెత్తే దశలో వాటిలో ఉండే పోషకాల స్ధాయిలు రెట్టింపవుతాయి. ఇందులో ఉండే ప్రొటీన్లు త్వరగా జీర్ణమవుతాయి. మొలకెత్తిన గింజల్లో అధిక మొత్తంలో పీచును కలిగి ఉంటాయి. మలవిసర్జన సజావుగా సాగటంతోపాటు, మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రోగాలను ఎదుర్కొనేందుకు ఇవి ఎంతగానో సహాయకారిగా పనిచేస్తాయి.