Is papaya great for improving digestion?
Papaya : పండిన బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అదే విధంగా పచ్చి బొప్పాయి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పచ్చి బొప్పాయి ఉదర సంబంధిత వ్యాధులను నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయిలో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు, పపైన్, ఫైటోన్యూట్రియెంట్లు వంటి ఎంజైమ్స్ వంటి ముఖ్యపోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
పచ్చి బొప్పాయి తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. దీనిలో ఎక్కువమొత్తంలో అరుగుదలకు సంబంధించిన ఎంజైమ్‌లు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియలో సహాయకారిగా పనిచేస్తాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్, గాయాలు వంటి వాటిని నయం చేసే లక్షణాలను కలిగి ఉంది. అంతేకాదు మలబద్ధకంతో బాధపడేవారికి సమర్థవంతమైన జీర్ణచికిత్సగా పనిచేస్తుంది. ఆహారంలో ప్రోటీన్ జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ప్రోటీన్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉన్నట్లయితే పచ్చిబొప్పాయిని తీసుకోవచ్చు.
కామెర్లు , కాలేయానికి సంబంధించిన ఇతర సమస్యలలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. పచ్చి బొప్పాయిలో విటమిన్లు ఇ, సి మరియు ఎ అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్ మరియు క్యాన్సర్‌ను దరిచేరకుండా చూసే పోషకాలు ఉంటాయి. బొప్పాయి పండు అల్సర్లకు ఉపయోగించవచ్చు.
ఇది గాయాలను నయం చేస్తుంది. కాలిన గాయాలపై బొప్పాయి పండు గుజ్జును పూతగా పూస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది. ఈ ఖనిజాలు ఇన్సులిన్ విడుదలను పెంచడంలోనూ సహాయపడతాయి. టైప్ 2 డయాబెటిస్‌కు కారణమయ్యే కీ ఎంజైమ్‌లకు వ్యతిరేకంగా కూడా పని చేస్తుంది.
డెంగ్యూతో బాధపడేవారికి బొప్పాయి ఆకుల రసాన్ని తాగించాలి. డెంగ్యూసమయంలో విపరీతంగా పడిపోయే తెల్ల రక్త కణాల ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి పచ్చిబొప్పాయి సహాయపడుతుది. పచ్చి బొప్పాయి కాయలను నేరుగా తినలేరు కనుక ఇలా కూర రూపంలో వండి తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలన్నీ మనకు లభిస్తాయి.
పచ్చి బొప్పాయి కూర తయారీ ;
పచ్చి బొప్పాయి అర కేజీ, ఉల్లిపాయ తరుగు పావు కప్పు, టమాటా తరుగు పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, సోంపు గింజలు ఒక టీస్పూన్, మిరప కారం ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్లు, పసుపు పావు టీస్పూన్, కొత్తిమీర తరుగు రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి.
ముందుగా కుక్కర్‌లో నూనె వేసి వేడి చేయాలి. సోంపువేసి వేగిన తరువాత అల్లం, వెల్లుల్లి తురుము వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాక టమాటా తరుగు వేసి బాగా ఉడికించాలి. మిగిలిన మసాలా వస్తువులన్నీ వేసి వేయించాలి. చివరగా బొప్పాయి ముక్కలు వేసి బాగా కలిపి ఒక కప్పు నీళ్లు వేసుకుని మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపుకోవాలి. రుచికరంగా ఉండే ఈ కూరను ఆహారంలో బాగంగా తీసుకోవచ్చు.