Build Strong Muscles : బలమైన కండరాల నిర్మాణానికి సులభమైన వ్యాయామం ఇదే? రోజు ఈ వ్యాయామంతో ఆరోగ్యంగా జీవించొచ్చు తెలుసా!

రోజుకు 10,000 అడుగులు వేయడం కొంతమందికి చాలా సులభం. నిశ్చల జీవనశైలి నుండి రోజుకు ఎనిమిది కిలోమీటర్లు నడవడం చాలా కష్టం. నడక ప్రారంభించాలనుకునే వారు ముందు చిన్నచిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి.

Is this the easiest exercise to build strong muscles? Did you know that you can live healthy with this exercise every day!

Build Strong Muscles : వయస్సు పెరుగుతున్నా కండరాలు ఆరోగ్యంగా ఉంటే చరుకుగా కదిలేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన కండరాలతో మీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవచ్చు. 40 సంవత్సరాల వయస్సు నుండి దశాబ్దానికి కండర ద్రవ్యరాశిలో 8 శాతం వరకు కోల్పోతారు. కండరాల నష్టం వృద్ధాప్యం కారణంగా మాత్రమే కాకుండా, గాయాలు, అనారోగ్యం, పోషకాహార లోపం మొదలైన వాటి వల్ల కూడా ఉంటుంది. కండరాల పనితీరులో తగ్గుదల ఎక్కువగా కండర ద్రవ్యరాశిలో మార్పుల కారణంగా రోజువారీ జీవిత కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది.

కండర ద్రవ్యరాశి మరియు బలం మధ్య అసమతుల్యత ఎక్కువగా కండరాల నాణ్యత క్షీణించడం వల్ల చోటుచేసుకుంటుంది. కండరాల బలం కండర ద్రవ్యరాశి కంటే చాలా ముఖ్యమైనది. కండరాల నష్టాన్ని అరికట్టడానికి మంచి పోషకాహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. శారీరక వ్యాయామాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అందులోను నడక అనేది వ్యాయామాలలో చాలా సులభమైన మార్గం. వైద్యులు, ఫిట్‌నెస్ నిపుణులు నడకను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఇది అన్ని వయసుల వారికి సులభమైన కార్యకలాపం. నడకకు నిర్దిష్ట శిక్షణ, పరికరాలు, దుస్తులు అవసరం లేదు. బలమైన కండరాలను నిర్మించడానికి సురక్షితమైన వ్యాయామం.

తగినంత పోషకాహారం తీసుకోవడంతో పాటుగా రోజువారిగా నడకను జత చేయడం వల్ల కండరాల నష్టం కారణంగా తలెత్తే అవాంఛిత ఆరోగ్య పరిస్థితులను నివారించడం వచ్చు తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. మన శరీర రోజువారీ అవసరాలను తీర్చడానికి తగినంత పోషకాల కోసం పోషకాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారాలను తీసుకోవటం చాలా అవసరం. వైవిధ్యమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.

బలమైన కండరాల కోసం ఎలా నడవాలంటే ;

రోజుకు 10,000 అడుగులు వేయడం కొంతమందికి చాలా సులభం. నిశ్చల జీవనశైలి నుండి రోజుకు ఎనిమిది కిలోమీటర్లు నడవడం చాలా కష్టం. నడక ప్రారంభించాలనుకునే వారు ముందు చిన్నచిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. నిదానంగా పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒక వారం పాటు రోజుకు 4,000 వేల అడుగులు వేయటం ప్రారంభించాలి. తరువాత రోజకు 10,000 అడుగులు వేసే దశకు చేరుకోవాలి.

కారును ఆఫీసు నుండి దూరంగా పార్క్ చేయడం ద్వారా, ఎలివేటర్‌కు బదులుగా మెట్లు ఎక్కడం ద్వారా, సాయంత్రం అదనపు నడక ద్వారా రోజుకు 10 వేల అడుగులు వేసే టార్కెట్ ను పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా రోజుకు 10 నిమిషాల చురుకుగా నడవటం వల్ల కండరాలను బలోపేతం అవుతాయి. బరువులు ఎత్తడం ,సాగే రెసిస్టెన్స్ బ్యాండ్‌లను ఉపయోగించడం వంటి వాకింగ్ రెసిస్టెన్స్ వ్యాయామాలు కాకుండా కండర ద్రవ్యరాశిని కోల్పోకుండా, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడే నడక వంటి వాటిని అనుసరించటం మేలు. అలాగే కండరాల ఆరోగ్యానికి తోడ్పడటానికి తగిన పోషకాహారం, సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం చాలా కీలకం. శరీరంలోని ప్రతి కణానికి ఇంధనం అందించే ఆహారం బలం కోసం కండరాలకు అవసరం. తద్వారా 10,000 అడుగుల లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

ఎంత నడుస్తున్నామన్నది తెలుసుకోవాలంటే ;

ఎన్ని అడుగులు వేశారన్నది ట్రాక్ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లో స్టెప్ ట్రాకర్ యాప్‌ని ఉపయోగించవచ్చు. ఈ యాప్‌లు మీ రోజువారీ లక్ష్యాలపై నోటిఫికేషన్‌లు, రిమైండర్‌లను పంపుతాయి. ఆ పర్ఫెక్ట్ స్కోర్‌ని తెలుసుకోవటానికి, అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయటానికి సహాయపడుతుంది. ప్రతి గంటకు ఐదు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పాటు విశ్రాంతి తీసుకోవడానికి, ఇంటి చుట్టూ నడవడం, స్థలంలో పరుగెత్తడం, జంపింగ్ చేయడం వంటి చురుకైన పనులు చేయటానికి ఉపయోగపడతాయి. పగటిపూట ఏదో ఒక సమయంలో 30 నిమిషాలు జాగింగ్ , ట్రెడ్‌మిల్‌ నడక అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం సహాయపడుతుంది. అంతేకాకుండా కండరాల బలం, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు