Is your baby burping while eating? Why?
Eating Food : పిల్లలను పెంచి పెద్ద చేయడం అన్నది తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదని బాధపడుతుంటారు. దీనికి రెండు కారణాలుంటాయి. ఒకటి పిల్లలు భోజన వేళల మధ్యలో చిరుతిండ్లు తింటూ ఉండవచ్చు. లేదంటే వారికి ఆకలి తగ్గిపోయి ఉండటం. అన్నానికి ముందుగా చిరుతిండ్లూ పిల్లలకు పెట్టటం మంచిదికాదు. భోజనం సంతృప్తిగా తిన్న తరువాతనే అవసరమనుకుంటే చిరుతిండ్లను అందించాలి.
పిల్లలకు బలవంతంగా ఏదీ తినిపించకూడదు. అలా చేస్తే పిల్లలు వారంతట వారు తినే ప్రయత్నం చేయాలి. బలంవంగా తినిపించటం వంటి పనులు చేయరాదు. మీరు దేనినైతే వద్దని వారిస్తారో, పిల్లలు దానినే ఇష్టపడతారు. బంగాళా దుంపల చిప్స్ తినకూడదని వారిస్తే, రుచిగా ఉన్నా లేకపోయినా పిల్లలు అవే కావాలని పట్టుబడతారు. పిల్లలు ఏదో ఒక పదార్థానే ఇష్టప డుతూ,ఎప్పుడూ దానినే కోరుకుంటూ ఉంటే, కొంతకాలంపాటు దానినే తినిపించడంలో తప్పు లేదు. కాకపోతే, మధ్య మధ్యలో కొత్త రకమైన ఆహార పదార్థాలను ఇవ్వటం మంచిది.
పిల్లలకు ఆకలి మందగించిందని గమనించినట్లైతే ఆకలి పెరగటం కోసం పెరుగులోకొంచెం శొంఠిపొడిని, సైంధవ లవణాన్ని కలిపి పిల్లలకు తినిపిస్తే ఆకలి పెరు గుతుంది. భోజనానికి ఒకటి రెండు గంటల ముందు బెల్లం పానకానికి మిరియాల పొడిని చేర్చి తాగిస్తే కూడా ఆకలి వృద్ధి అవుతుంది. పిల్లలకు పెద్ద ప్లేటులో ఆహారాన్ని కొద్దిగానే పెట్టి, వారికి ఆహారంపై ఆసక్తిని కలిగించాలి. కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులు తప్పితే మిగతా ఎవరు తినిపించినా సంతృప్తిగా తింటారు. మీ పిల్లలు మీ ఇంట్లో కాకుండా, ఇతరుల ఇంట్లో ఎందుకు ఆసక్తిగా తింటారనే దానికీ పిల్లలు మార్పు కోరుకుంటున్నారని భావించాలి.
పిల్లలు వాళ్లు చెప్పింది మనం శ్రద్ధగా వినాలని కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ పని ఒత్తిడి కారణంగా వారు చెప్పింది పట్టించుకోకుండా తాము చెప్పిందే వినాలన్న భావనను కలిగి ఉంటున్నారు. ఇది ఏమాత్రం సరైంది కాదు. పిల్లలకు ఏమి కావాలో ముందు తెలుసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని వారు ఇష్టంగా తింటారు కనుగొని దానిని అందించేందుకు ప్రయత్నం చేయాలి. వారు అడిగిన ఆహారం వారి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేది అయితే మాత్రం సున్నితంగా అర్ధమయ్యేలా వివరించి చెప్పాలి. దాని వల్ల వచ్చే నష్టాలను, ఆరోగ్య సమస్యలను తెలియపరచాలి.