Smooth Digestion : జీర్ణప్రక్రియ సాఫీగా ఉండటంతోపాటు రోజుంతా యాక్టీవ్ గా ఉండాలంటే ఉదయాన్నే వీటిని తీసుకోవటం మంచిది!

ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె వేసుకుని తాగడం వల్ల కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇది నరాలను శాంత పరుస్తుంది. నిమ్మ, తేనె మీ జీర్ణక్రియను మెరుగ్గా మారుస్తుంది. ఉదయాన్నే ఇవి తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గి బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

Smooth Digestion :

Smooth Digestion : మన ఆహార అలవాట్లను బట్టే జీర్ణప్రక్రియ, విసర్జన వ్యవస్థల పనితీరు ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే జీర్ణప్రక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో పాటు రోజంతా చురుకుగా ఉండలేకపోతారు. ఉదయాన్నే నిద్రలేవగానే మనం తీసుకునే ఆహారంపై కూడా జీర్ణప్రక్రియ అధారపడి ఉంటుంది. ఉదయాన్నే మనం తీసుకునే ద్రవపదార్ధాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రోజంతా చురుకుగా ఉండేలా సహాయపడతాయి. అలాంటి ద్రవపదార్ధాల గురించి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. రాగి జావ ; రాగి జావ లో ఐరన్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రాగి మాల్ట్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఇందులోని విటమిన్స్, మినరల్స్ మీ కండరాలు, ఎముకలని బలంగా చేస్తుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్ధని హెల్దీగా మారుస్తుంది. ఇది 100 శాతం గ్లూటెన్ ఫ్రీ. దీనిని మీరు ఉదయాన్నే తీసుకోవచ్చు.

2. కొబ్బరి నీరు ; కొబ్బరి నీరు నిజానికి చాలా మంచిది. రోజులో ఉదయాన్నే ఈ నీరు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది హీరోయిన్స్ తాము తమ డైట్‌లో కొబ్బరి నీరు ఉంటుందని చెబుతున్నార. ఉదయాన్నే దీనిని తాగడం వల్ల ఎనర్జీ వస్తుంది. మన దగ్గర కొబ్బరి నీరు సులభంగా దొరుకుతుంది. అయితే, కేవలం కొబ్బరి నీరు రోజువారిగలేకుంటే అందులో నిమ్మరసం కలపుకుని తాగొచ్చు.

3. నీరు ; నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే లేవగానే, ఒకటి, రెండు గ్లాసుల నీరు తాగండి. గోరువెచ్చగా ఉంటే మరింత మంచిది. జీర్ణ సమస్యలు, అనేక సమస్యలకు ఈ నీరు పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మంచి రెమిడీలా పనిచేస్తుంది.

4. నిమ్మరసం, తేనె, వేడినీరు ; ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె వేసుకుని తాగడం వల్ల కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇది నరాలను శాంత పరుస్తుంది. నిమ్మ, తేనె మీ జీర్ణక్రియను మెరుగ్గా మారుస్తుంది. ఉదయాన్నే ఇవి తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇదీ మంచి డీటాక్స్ డ్రింక్‌లా పని చేస్తుంది. దీంతో పాటు స్కిన్ కూడా అందంగా మెరుస్తుంది.

5. దాల్చిన చెక్క టీ ; దాల్చిన చెక్కని మనం మసాలా దినుసుల్లో విరివిగా వాడతాం. దీనిని తాగడం వల్ల ఇందులోని ప్రత్యేక గుణాలు రక్తంలోని బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. అదే విధంగా, స్కిన్ మెరిసేలా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్న దాల్చిన క్యాన్సర్ కారకాలకు కూడా వ్యతిరేకంగా పని చేస్తుంది. వీటితో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

6. మెంతి, జీలకర్ర నీరు; జీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో జీలకర్ర, మెంతులు ఉపకరిస్తాయి. కొద్దిగా మెంతులు, జీలకర్రని రాత్రంతా నానబెట్టాలి. వీటిని ఉదయాన్నే తాగాలి. వీటిని తాగడం వల్ల మెటబాలిజం పెరిగి జీర్ణప్రక్రియ ఈజీగా మారుతుంది. వీటిని తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కూడా కరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు