Green Apple : ఈ పండు రోజు ఒక్కటి తింటే చాలు ! ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు తెలుసా?

ప్రతిరోజు ఒక గ్రీన్ యాపిల్ తీసుకోవటం ద్వారా గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. రోజువారిగా గ్రీన్ యాపిల్ తీసుకునే వారిలో రక్తనాళాలలో కొవ్వును సేకరిస్తుంది. అంతేకాక గుండెపోటు అవకాశాలు నివారించటంతోపాటు గుండెకు సరైన రక్త ప్రవాహం జరిగేలా చూస్తుంది.

It is enough to eat this fruit once a day! Do you know the many health benefits?

Green Apple : యాపిల్స్ లో అనేక రకాలు ఉన్నాయి. అంతేకాకుండా రంగులు కూడా ఉన్నాయి. అయితే వాటిలో గ్రీన్ యాపిల్స్ ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ యాపిల్‌లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు,ఖనిజాలు మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థ లోపాలు నుండి ఉపశమనం, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటం, బిపి తగ్గించడం,రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటం, ఆకలి మెరుగుపరచటంలో సహాయకారిగా పనిచేస్తుంది.

రెడ్ యాపిల్స్ కొంచెం తియ్యని రుచిని కలిగి ఉన్నప్పటికీ, గ్రీన్ యాపిల్స్ లో తక్కువ చక్కెర, ఎక్కువ ఫైబర్ మరియు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్ మంచి మొత్తంలో విడుదలవుతుంది. ఇది శరీరంలోని కణాలు చక్కెరను గ్రహించడానికి సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండుట వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. దీనిలోని ఇనుము,జింక్,రాగి,మాంగనీస్,పొటాషియం మొదలైన ఖనిజాలు రక్తంలో ఆక్సిజన్ స్దాయిలను పెంచటంలో దోహదపడతాయి.

ప్రతిరోజు ఒక గ్రీన్ యాపిల్ తీసుకోవటం ద్వారా గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. రోజువారిగా గ్రీన్ యాపిల్ తీసుకునే వారిలో రక్తనాళాలలో కొవ్వును సేకరిస్తుంది. అంతేకాక గుండెపోటు అవకాశాలు నివారించటంతోపాటు గుండెకు సరైన రక్త ప్రవాహం జరిగేలా చూస్తుంది. గ్రీన్ యాపల్ లో విటమిన్ C ఉండుటవల్ల ఫ్రీ రాడికల్స్ ద్వారా చర్మ కణాలకు వచ్చే నష్టాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు దరిచేరకుండా రక్షిస్తుంది.

దీనిలోని యాంటీ ఆక్సిడంట్ లు కణాల పునర్నిర్మాణం, కణాల పునరుత్తేజంనకు సహాయం చేస్తాయి. కాలేయాన్ని రక్షిస్తాయి. కీళ్ల వ్యాధులు దరిచేరకుండా చేయటంతోపాటుగా, మతిమరుపు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా వృధ్ధులకు గ్రీన్ ఆపిల్ చేసే మేలు అంతాఇంతాకాదు. చర్మాన్ని కాంతి వంతంగా చేయటంతోపాటు, చర్మపరమైన సమస్యలు రాకుండా చూస్తుంది. చర్మానికి తేమను ఇవ్వటంతోపాటు ముడతలు రాకుండా నివారిస్తుంది.