అలీబాబా అనగానే వెంటనే గుర్తుచ్చేది.. జాక్ మా. అలీబాబా గ్రూపు సహా వ్యవస్థాపకుడిగా ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ సంచలనమే. ఉద్యోగుల పనివేళలపై ఆయన నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటాయి. ఉద్యోగుల పనివేళల్లో అలీబాబా ఫాలో అయ్యే ఫార్మూలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 2019 ఆరంభంలో జాక్ మా.. తమ ఉద్యోగుల పనిదినాలు, సమయాలపై ఎన్నో ఫార్మూలాలు అమల్లోకి తెచ్చారు.
చైనాలో టెక్ కంపెనీల్లో ఓవర్ టైమ్ వర్క్ కల్చర్ కామన్. అలీబాబా తమ సంస్థ ఉద్యోగుల పట్ల ఇదే ఫార్మూలాను ఫాలో అవుతున్నారు. అందుకే 996 అనే ఫార్మూలను అమల్లోకి తెచ్చారు. అంటే.. వారంలో 6 రోజులు మాత్రమే పనిచేయాలని, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనివేళాలుగా ప్రకటించారు. యవ ఉద్యోగులను ఎక్కువగా ప్రోత్సహిస్తూ వర్క్ కల్చర్ లో వినూత్న మార్పులకు జాక్ మా శ్రీకారంచుట్టారు. కానీ, ఇప్పుడు బిలియనరీ జాక్ మా… మరో సరికొత్త ఫార్మూలాతో ముందుకు వచ్చారు.
AI టెక్నాలజీ వచ్చాక.. పని తగ్గుతోంది :
అదే.. వారానికి 12గంటలే పని. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యానా ఆయన ఈ కొత్త వర్కింగ్ టైం ఫార్మూలా వర్క్ ఔట్ చేయాలని భావిస్తున్నారు. బ్లూమ్ బెర్గ్ కథనం ప్రకారం.. షాంఘైలో జరిగిన ప్రపంచ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ కాన్ఫిరెన్స్ లో జాక్ మా ఈ ఫార్మూలాను ప్రస్తావించారు. రోజుకు 4 గంటలు.. వారంలో 3 రోజులు మాత్రమే పనిచేసే విధానంపై ప్రస్తావించారు. AI అడ్వాన్సడ్ టెక్నాలజీ సాయంతో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సంస్కరణలు తీసుకురావచ్చునని గట్టిగా విశ్వసిస్తున్నట్టు చెప్పారు. టెస్లా ఇంక్. చీప్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఎలన్ మస్క్ తో ఆయన కాన్ఫిరెన్స్ లో మాట్లాడారు. శక్తివంతమైన విద్యుత్ ప్రభావంతో చాలామంది సాయంత్రం వేళల్లో ఎక్కువ సమయం డ్యాన్సింగ్ పార్టీల్లో గడుపుతున్నారని అన్నారు. ఇందుకు ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనే ప్రధాన కారణమన్నారు. చాలామంది ఎక్కువ సమయం ఎంజాయ్ చేయగలగుతున్నారని చెప్పారు.
మనిషికి గుండె.. కంప్యూటర్లకు చిప్ :
టెక్నాలజీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉద్యోగులకు విశ్రాంతి సమయం ఎక్కువగా దొరుకుతుందని చెప్పడానికి జాక్ మా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆటోమేషన్ విధానం పెరిగిపోవడం వల్ల ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఇవ్వడం, రిక్రూట్ తగ్గిపోవడానికి దారితీస్తుందనడాన్ని జాక్ మా ప్రస్తావించలేదు. ‘ఉద్యోగాలపై నాకు ఆందోళన లేదు. ఆశావాదంగా ఆలోచిస్తే.. AI మనుషులకు ఎంతో సహాయపడుతుంది. వారికి పని నుంచి విశ్రాంతి కల్పిస్తోంది. మనుషులకు హృదయం ఎలాగో.. కంప్యూటర్లకు కూడా చిప్స్ అలానే పనిచేస్తాయి’ అని జాక్ మా.. తెలివిగా సమాధానమిచ్చారు.
‘ప్రస్తుత విద్యా వ్యవస్థ మొత్తం పాతది. మనిషి కంటే మిషన్లే తెలివి, నైపుణ్యాల్లో బాగా పనిచేస్తాయి. భవిష్యత్తులో విద్యా వ్యవస్థలతో ప్రజలను మరింత సృజనాత్మకంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే 10నుంచి 20 ఏళ్లలో ప్రతి మనిషి, దేశం, ప్రభుత్వం విద్యా వ్యవస్థను చక్కదిద్దడంపైనే ఫోకస్ పెట్టాలని చెప్పారు. తమ పిల్లలను ఉద్యోగం పొందేలా చేయలన్నారు. ఆ ఉద్యోగం వారంలో 3 రోజులు మాత్రమే ఉండాలన్నారు. రోజుకు 4 గంటలు మాత్రమే పనిచేసేలా ఉండాలి’ అని జాక్ మా స్పష్టం చేశారు.