Jaggery : ఆరోగ్యానికి మేలు చేసే బెల్లం! బెల్లం గురించి ఆయుర్వేదం ఏంచెబుతుందంటే?

నీళ్ళ విరేచనాల సమస్యతో బాధపడేవారు బెల్లం, ఆవాలు సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి చిన్నచిన్న మాత్రలుగా చేసి మూడు పూటలా వేసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుముఖం పడతాయి.

jaggery

Jaggery : బెల్లం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతుంది. కొత్త బెల్లం వాడటం కంటే ఏడాది పాటు నిల్వవున్న బెల్లాన్ని ఉపయోగించటం వల్ల ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పాత బెల్లం వాడటం వల్ల సర్వ రోగాలు హరిస్తాయని మన పెద్దలు సైతం అంటుంటారు. బెల్లం నోటికి రుచిని ఇవ్వటమే కాదు జీర్ణశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు బెల్లం తీసుకోవటం వల్ల మనకు లభిస్తాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ;

1. ఆవు పెరుగులో పాత బెల్లం కలుపుకుని ప్రతిరోజు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెల్లం జీలకర్ర సమపాళ్లలో కలిపి దంచి చిన్నచిన్న ఉండలు చేసుకుని రోజుకు 4 చొప్పున తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.

2. నీళ్ళ విరేచనాల సమస్యతో బాధపడేవారు బెల్లం, ఆవాలు సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి చిన్నచిన్న మాత్రలుగా చేసి మూడు పూటలా వేసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుముఖం పడతాయి.

3. అల్సర్, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు పాత బెల్లం, అల్లం, నువ్వులు సమపాళ్లలో తీసుకుని బాగా దంచి చిన్నచిన్న ఉండలు చేసుకుని తింటే అల్సర్, కడుపులో మంట సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

4. చర్మంపై దద్దుర్లు వస్తుంటే బెల్లం, వాము సమభాగాలుగా తీసుకుని మెత్తగా చేసుకోవాలి. చిన్నసైజు ఉండలుగా చేసుకుని పూటకు 3 చొప్పున ఆవనూనెలో ముంచి తీసుకుంటే దద్దుర్లు సమస్య పోతుంది.

5. అరికాళ్లు, అరచేతుల్లో చర్మం పొరలుపొరలుగా ఊడిపోతుంటే బెల్లం, అల్లం సమంగా కలపి మెత్తగా చేసి రెండు పూటలా 5 గ్రాముల చొప్పున తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది.

6. తలనొప్పి సమస్యను బెల్లం పోగొడుతుంది. ఇందుకోసం బెల్లం , శొంఠి సమపాళ్లలో తీసుకుని దంచుకోవాలి. ఆ ముద్దను తరచుకుగా వాసన చూస్తూ ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది.

7. విషజ్వరాలతో బాధపడేవారికి 20 గ్రాముల బెల్లం తీసుకుని దానిలో జీలక్ర చూర్ణం , వాము చూర్ణం, తీసుకుని దోరగా వేయించుకుని దంచుకోవాలి. రోజుకు రెండు పూటలా తీసుకుంటే విషజ్వరాలు తగ్గుముఖం పడతాయి.

8. పుండ్లు, వ్రణాలకు లేపనంగా కూడా బెల్లం ఉపయోగపడుతుంది. పాత బెల్లం చిక్కగా పాకం కాగించి దానిలో నెయ్యి తగినంత వేయాలి. పూటకు 100గ్రాముల చొప్పున తీసుకుంటే దెబ్బలు, నొప్పులు హరించుకుపోతాయి.

9. గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా పాత బెల్లం కలిపి తాగుతూ ఉంటే మూత్ర ప్రవాహం సవ్యంగా ఉటుంది. బెల్లం, జీలకర్ర కలిపి తీసుకున్నా మూత్రంబిగుసుకుపోయే సమస్యనుండి బయటపడవచ్చు.

10. పార్శపు తలనొప్పి బాధిస్తుంటే పాతబెల్లం 24 గ్రాములు, కర్పూరం 2 గ్రాములు కలిపి మెత్తగా నూరుకోవాలి. ప్రతిరోజు ఉదయం సమయంలో ఒక మోతాదుగా తీసుకుంటుంటే పార్శపు తలనొప్పి తగ్గిపోతుంది.