నెటిజన్లు ఫిదా: ‘జింగిల్ బెల్స్’ వీడియో వైరల్

  • Publish Date - December 19, 2019 / 02:13 PM IST

క్రిస్మస్ సంబరాలు ముందే మొదలయ్యాయి. దేశీ వెర్షన్‌కు చెందిన ‘జింగిల్ బెల్స్’ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2.13 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను Medivazhipadu by Toms అనే యూట్యూబ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులంతా కలిసి గ్రూపుగా Sinkari melamతో పాపులర్ హాలీడే సాంగ్ డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు.

చెందా మేళాంకు సంబంధించిన సింకారీ మేళాం ట్విస్ట్ అనేది క్లాసికల్ పర్ఫామెన్స్. కేరళలోని పండుగల్లో ఇదొక అంతర్భాగంగా నిర్వహిస్తుంటారు. ప్రత్యేకించి దేవాలయాల్లో తరుచుగా ఇలాంటి సంగీతాన్ని వాయిస్తుంటారు. సింకారీ మేళాం అనే అద్భుతమైన కాన్సెఫ్ట్ తో క్రిస్మస్ సాంగ్ ను జింగిల్స్ బెల్స్ పేరుతో వీడియోను రూపొందించారు.

ఈ మ్యూజిక్ కు తగినట్టుగా చిన్నారులంతా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొద్దిగంటల్లోనే 31వేల వ్యూస్ వచ్చాయి. ఎన్నో కామెంట్లు వచ్చాయి. వైరల్ అవుతున్న వీడియో ఇదే.