Pineapple
Pineapple : పుల్లగా, తీయగా రుచికరంగా ఉండే పైనాపిల్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సహా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. పైనాపిల్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఎంజైమ్‌లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం. పైనాపిల్‌లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
వాతాన్ని, కఫాన్ని ఉపశమనం చేయడంలో ఇది ఉపయోగ పడుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అజీర్తి సమస్యను నివారించటంలో ఈ పండు బాగా ఉపకరిస్తుంది. పైనాపిల్‌లో బ్రొమిలైన్ అనే ప్రొటియోలిటిక్ ఎంజైమ్ అజీర్తిని నివారించి తీసుకున్న ఆహారం జీర్ణ అయ్యేలా చేస్తుంది. భోజనం అనంతరం దీనిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గాయాలను మాన్పటంలో ఇది మంచి సహాయకారిగా పనిచేస్తుంది. రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని త్వరతిగతిన పునర్మించటంలో తోడ్పడుతుంది.
పైనాపిల్ ఇతర పండ్ల కంటే రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా ప్రభావితం చేస్తుంది. పైనాపిల్ గ్లైసెమిక్ సూచిక 51 నుండి 73 వరకు ఉంటుంది, ఇది మితంగా ఉంటుంది. షుగర్ రోగులు ఎక్కువ మోతాదులో పైనాపిల్ తినకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, షుగర్ రోగులు దీనిని
పరిమితంగానే తీసుకోవాలి. హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటంలో ఇందులోని విటమిన్ సి ఉపకరిస్తుంది.
శరీరంలోని మలినాలను తొలగించటంతోపాటుగా మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. గొంతునొప్పి, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు రోజుకు రెండు పైనాపిల్ ముక్కలు తినటం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది.
గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి అందించటం జరిగింది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.