Stay Healthy : ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 డైట్ చిట్కాలను అనుసరించండి చాలు!

చాలా మంది స్వీట్లు ఇష్టంగా తీసుకుంటారు. వాటిని తినకుండా మానుకోవటం కష్టంగా ఉంటుంది. అధిక చక్కెర వినియోగం వల్ల మధుమేహం, కొవ్వు కాలేయ వ్యాధి, అధిక రక్తపోటు, వాపు, బరువు పెరుగుట వంటి ప్రమాదాలు ఉంటాయి.

Just follow these 5 diet tips to stay healthy!

Stay Healthy : ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఆహారం కీలక పాత్ర వహిస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్ధ నుండి బయటపడాలంటే మంచి పోషకాలతో నిండి ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులతో ఆరోగ్యకరమైన జీవితం కోసం డైట్ చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆరోగ్యంగా ఉండటానికి డైట్ చిట్కాలు ;

1. ఆహారంలో ధాన్యాలు తప్పనిసరి చేసుకోండి ;

ఆహారంలో నట్స్, ధాన్యాలు, గింజలు, కూరగాయలు, పండ్లు మొదలైన ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం ఇబ్బందిగా అనిపిస్తే మితమైన మొత్తంలోనే తీసుకోండి. ప్రతిరోజూ కూరగాయలను తప్పనిసరిగా తీసుకోండి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా, మధుమేహం, అధిక రక్త చక్కెర , గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

2. స్నాక్స్ ఎంపిక విషయంలో ;

ఆకలితో ఉన్న సమయంలో చాలా మంది చిప్స్, చాక్లెట్స్ వంటివి తింటుంటారు. భోజనానికి భోజనానికి మధ్యలో స్నాక్స్‌ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యకరమైన అల్పాహారం తీసుకోవటం వల్ల బరువు పెరుగుతారు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే మధుమేహం, గుండె జబ్బులు మరియు అలసట వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చిరుతిండిలో డ్రై ఫ్రూట్స్, మొలకలు మరియు పండ్లను తీసుకోండి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి.

3. చక్కెరతో తయారైన పదార్ధాలు తగ్గించండి ;

చాలా మంది స్వీట్లు ఇష్టంగా తీసుకుంటారు. వాటిని తినకుండా మానుకోవటం కష్టంగా ఉంటుంది. అధిక చక్కెర వినియోగం వల్ల మధుమేహం, కొవ్వు కాలేయ వ్యాధి, అధిక రక్తపోటు, వాపు, బరువు పెరుగుట వంటి ప్రమాదాలు ఉంటాయి. శుద్ధి చేసిన తెల్ల చక్కెరకు బదులుగా బ్రౌన్ షుగర్ , బెల్లం ప్రత్యామ్నాయంగా ఎంచుకోండి. చక్కెర కంటే తక్కువ సుక్రోజ్ మరియు ఎక్కువ విటమిన్లు , ఖనిజాలను కలిగి ఉండే సహజమైన, శుద్ధి చేయని స్వీటెనర్ గా బెల్లాన్ని చెప్పవచ్చు.

4. అల్పాహారం తప్పనిసరిగా తీసుకోండి ;

బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్న వారు ఉదయం అల్పాహారం తీసుకోకుండా మానేస్తారు. ఇది ఏమాత్రం మంచిదికాదు. ప్రతిరోజూ ఉదయం తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారం అనేది రోజు ప్రారంభంలో అతి ముఖ్యమైనది. జీవక్రియను వేగవంతం కావటానికి అల్పాహారం సహాయపడుతుంది. క్యాలరీలను బర్నింగ్ చేయడంలో తోడ్పడుతుంది.

5. సరిపడినంత నీరు ;

బరువు తగ్గడానికి నీరు బాగా సహాయపడుతుంది. తగినంత నీరు శరీరంలోని వ్యార్ధాలను బయటకు పంపటంలో సహాయపడతాయి. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గుతారు. జీవ్రక్రియ వేగవంతం అవుతుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి నీరు సహాయపడుతుంది. రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు త్రాగాలని నిపుణులు సూచిస్తున్నారు.