Anemia : రక్తహీనత సమస్య నుండి బయటపడాలంటే ఈ ఆహారాలు తీసుకోండి చాలు!

రక్తహీనతకు అసలు కారణం ఆహారంలో ఇనుము లోపించటం. రక్తహీనత లోపాన్ని సరిదిద్దు కోవాలంటే ఐరన్ సంవృద్ధిగా లభించే ఆహార పదార్ధాలను తీసుకోవటం అవసరం.

Anemia : శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకుంటే ఆరోగ్యం పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడపవచ్చు. పోషకాల లోపం ఏర్పడితే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా పోషకాల లోపం దీర్ఘకాలం కొనసాగితే రక్తహీనతకు దారి తీస్తుంది. వాస్తవానికి రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో రోజురోజుకి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా పిల్లల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

రక్తహీనతకు అసలు కారణం ఆహారంలో ఇనుము లోపించటం. రక్తహీనత లోపాన్ని సరిదిద్దు కోవాలంటే ఐరన్ సంవృద్ధిగా లభించే ఆహార పదార్ధాలను తీసుకోవటం అవసరం.

ఐరన్ లభించే ఆహారపదార్ధాలు ;

1. పాలు , పెరుగు,తేనె, మాంసం, చేపలు, గుడ్డుసొన వంటి వాటిలో ఇనుము అధికంగా ఉంటుంది.

2. పండ్లైన అరటి, ఆపిల్, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, మామిడి, బొప్పాయి , దానిమ్మ వంటి వాటి ద్వారా ఐరన్ దొరుకుతుంది.

3. కూరగాయలైన టమోటో, ముల్లంగి, కాకర, ఉల్లిపాయలో ఐరన్ ఉంటుంది.

4. ధాన్యాల విషయానికి వస్తే బార్లి, శనగలు, జొన్నలు, మొక్కజొన్న, గోధుమలు వంటి ధాన్యాలలో బాదం, కొబ్బరి , ఖర్జూరం, చెరకు, బెల్లం వంటి వాటిల్లో కావాల్సినంత ఐరన్ దొరుకు తుంది.

5. ఇతర ఆకు కూరల విషయానికి వస్తే మెంతి కూర, పుదీనా, తోటకూర, పాలకూర, వంటి వాటిని తీసుకోవటం ద్వారా శరీరానికి కావాల్సిన ఐరన్ ను పొందవచ్చు. వీటిని రోజు మార్చి రోజు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పోషకాహాలు అధికంగా ఉండే ఈఆహారాలను రోజువారిగా ఆహారంలో చేర్చుకోవటం ద్వారా రక్తహీనత సమస్యను తొలగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు