Decrease Bloating : కీరదోస, యాపిల్ రసంలో నిమ్మరసం, అల్లం రసం కలిపి తీసుకుంటే?

క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌ను వ‌దిలించ‌డంలో కొన్ని కొన్ని పండ్లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి. అలాంటి వాటిల్లో కివి, అర‌టి, నారింజ, పైనాపిల్ పండ్లు ప్ర‌తి రోజు ఏదో ఒకదాన్ని తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి.

Decrease Bloating :

Decrease Bloating : ఆహారం జీర్ణం కాక‌పోవ‌డం, పేగుల్లో వాపు, మ‌ద్యపానం, ధూమ‌పానం, క‌డుపులో కొవ్వు పేరుకుపోవ‌డం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవ‌డం, వ్యాయామం చేయకపోవడం, ఫైబ‌ర్ ఫుడ్‌ తక్కువగా, లేదంటే ఎక్కువ‌గా తీసుకోవడం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రంగా అనిపిస్తుంది. ప్రస్తుతం చాలామందిలో ఈ కడుపుబ్బరం సమస్యకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లే . వీటికారణంగానే కడుపు ఉబ్బరం సమస్య ఏర్పడి తినాలన్న కోరిక కలిగినా ఏమి తినలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది.

కడుపుబ్బరం సమస్య తలెత్తిన సందర్భంలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. వాటి ద్వారా సమస్యను గుర్తించవచ్చు. కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం, ఆకలి లేకపోవడం, పెద్ద శబ్దంతో తేంపులు రావడం,కడుపు ఉబ్బరంగా ఉండి కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం, పొట్టలో గడబిడలు, ఆకలి లేకపోవడం, అన్నం హితవు లేకపోవడం, ఛాతిలో మంట, తేన్పులు ఎక్కువగా రావడం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక కడుపునొప్పి రావటం, మలబద్ధకం ఏర్పడటం, అపాన వాయువు ఎక్కువగా పోతుండడం, జీర్ణాశయంలో పుండు ఏర్పడి కడుపులో మంటతో కూడిన నొప్పిరావటం, నోటిలో నీళ్ళు ఊరడం, వాంతులు అవడం వంటి లక్షణాలు ముఖ్యంగా కనిపిస్తాయి.

కడుపుబ్బరం సమస్య నుండి బయటపడాలంటే ;

1. భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం అలవాటు చేసుకోవాలి. అలా నడుస్తున్నప్పుడు పొట్టని లోపలికి బయటికి అనడం లాంటివి చేయాలి. అలా చేయడం వల్ల కడుపు లోపల గాలి బయటకు వెళ్లి కడుపు ఉబ్బరం సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.

2. కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్న వారు కూల్ డ్రింక్, సోడా లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

3. భోజనం చేసేటప్పుడు నిటారుగా కూర్చుని తినాలి. నోరు మూసుకొని ఆహారాన్ని నములాలి. తినేటప్పుడు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండాలి. మాట్లాడితే పొట్టలోకి గాలి వెళ్లడం వల్ల కడుపుబ్బరం సమస్యలు తలెత్తుతాయి.

4. క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌ను వ‌దిలించ‌డంలో కొన్ని కొన్ని పండ్లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి. అలాంటి వాటిల్లో కివి, అర‌టి, నారింజ, పైనాపిల్ పండ్లు ప్ర‌తి రోజు ఏదో ఒకదాన్ని తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి.

5. ధనియాలు జీలకర్ర గింజలు పెన్నెల్ గింజలను సమాన పరిమాణంలో తీసుకుని వాటికి కొన్ని నల్ల మిరియాలు కూడా జోడించి పొడి చేసుకోవాలి. ఆ పొడిని టీ స్పూన్ మోతాదులో తీసుకొని నీటిలో వేసి మరిగించాలి. భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు ఆ మిశ్రమాన్ని తాగాలి.

6. కీర‌దోస‌, ఒక యాపిల్ ల‌ను తీసుకుని ర‌సం త‌యారు చేయాలి. తరువాత ఆ ర‌సంలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం, ఒక స్పూన్ అల్లం ర‌సం క‌లిపి తీసుకుంటే క‌డుపు ఉబ్బ‌రానికి గురికాకుండా ఉంటారు. నిమ్మరసం అల్లం నీరు ఆల్కలీన్ పిహెచ్ ని ప్రోత్సహిస్తుంది. దాంతో ఆమ్లత్వం గ్యాస్ ఏర్పడడానికి తగ్గించి ఆరోగ్యకరమైన జీర్ణక్రియను వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఎంతో బాగా ప్రేరేపిస్తుంది.