Lemon : ఆరోగ్యంతోపాటు అందానికి నిమ్మ

ముఖంపై ముడతలు తొలగించేందుకు నిమ్మ బాగా ఉపకరిస్తుంది. బొప్పాయి రసంలో నిమ్మ తొక్క పొడి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం , మెడ ప్రాంతాల్లో అప్లై చేయాలి.

Lime

Lemon : ఆరోగ్యానికి నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయలో ఔషద గుణాలు అన్నీ ఇన్నీ కావు. నిమ్మ తొక్క నుంచి రసం వరకు ప్రతి ఒక్కటీ శరీరానికి ఉపయోగపడతాయి. నిమ్మలో విటమిన్‌ C, విటమిన్‌ B, కాల్షియం, పాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటి సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. నిమ్మ కాయలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. నిమ్మ ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిమ్మలోని ఔషదగుణాలు మీ అందాన్ని రెట్టింపు చేయటంతోపాటు, చర్మానికి మేలు చేస్తుంది. చర్మ సమస్యలు కూడా సులువుగా తొలగించుకోవచ్చు.

నిమ్మతో సౌందర్య ప్రయోజనాలు ;

నిమ్మకాయను సంగంగా కోసి దానిపై తేనె కొద్దిగా వేసి ముఖం చేతులు, మెడ, కాళ్లకి రుద్దు కోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల చర్మ కాంతి వంతంగా మారుతుంది. ముడతలు, నల్ల మచ్చలు తొలగిపోతాయి. దీనిలోని సి విటమిన్ కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మృధువుగా , కాంతి వంతంగా మారేలా చేస్తుంది.

నిమ్మ తొక్కతో పళ్లను రుద్దితే పళ్లపై ఉండే పసుపు పచ్చ రంగు పోతుంది. పళ్లు తెల్లగా మెరుస్తాయి. పావు స్పూను బేకింగ్ సోడాకి కొంచెం నిమ్మరసం చేర్చి దాంతో పళ్లు తోమితే పళ్లు తెల్లగా మారతాయి. ఎండవేడి కారణంగా వేసవి కాలంలో పెదవులు నల్లగా మారతాయి. అలాంటి సందర్భంలో రాత్రి పడుకునే ముందు నిమ్మరసానికి కొద్దిగా తేనె కలిపి పెదాలకు రాసుకోవాలి. ఇలా కొద్దిరోజులు క్రమం తప్పకుండా చేస్తే పెదవులపై నలుపు తొలగిపోయి పెదవులు అందంగా మారతాయి.

ముఖంపై మొటిమలు సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. నలుగురిలోకి వెళ్ళాలంటేనే ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కొద్దిగా నిమ్మరసాన్ని తీసుకుని మొటిమలు ఉండే ప్రాంతంలో రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. నిమ్మరసంలో ఉండే ఆస్కార్బిక్ ఆసిడ్ మొటిమలను దూరం చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు రాకుండా నివారిస్తాయి.

మృదువైన, సిల్కీ చర్మం కోసం ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్‌లో ఒక టీస్పూన్ నిమ్మరసం మరియు ఒక టీస్పూన్ నిమ్మ తొక్క పొడి కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 30 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

ముఖంపై ముడతలు తొలగించేందుకు నిమ్మ బాగా ఉపకరిస్తుంది. బొప్పాయి రసంలో నిమ్మ తొక్క పొడి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం , మెడ ప్రాంతాల్లో అప్లై చేయాలి. అరగంట తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగిన ఆలివ్ నూనెను అప్లై చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే ముడతలతోపాటు వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి.

నిమ్మతొక్కలు ఎండవేసి, కొన్ని ఉలవలు లేదా పెసలు కలిపి, మరపట్టించి, ఆ పిండిని చర్మానికి రాసుకుని స్నానం చేస్తే, చర్మం నిగ నిగ లాడుతూ ఉంటుంది. తలపై ఉన్న చుండ్రును పోగొట్టేందుకు నిమ్మరసం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వారానికి రెండు సార్లు నిమ్మరసాన్ని జుట్టుకు పట్టించితే చుండ్రు బాధ తగ్గుతుంది.