Lemon peels have many benefits including removing skin problems, dark spots, wrinkles!
Lemon Peels : నిమ్మవల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అదే విధంగా నిమ్మకాయ పైన ఉండే తొక్కుతో కూడా వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి. చర్మం, జుట్టు, పొట్ట ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. నిమ్మ తొక్కల్లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిమ్మ తొక్కలను ఎండ బెట్టి మెత్తని పొడి మార్చుకొని నిల్వచేసుకోవచ్చు. ఈ పొడి ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దంతాలు, నోటి సమస్యలను దూరం చేస్తాయి.
నిమ్మకాయ తొక్కల్లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. అది కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తోంది. లివర్‌లో బైల్ యాసిడ్స్ బాగా విడుదలయ్యేలా చేస్తుంది. నిమ్మ కాయ తొక్కలు అధిక బరువును తగ్గించడమే కాకుండా బీపీ కూడా కంట్రోల్ ఉండేలా చేస్తాయి. షుగర్ వ్యాధి, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి రోగాల ప్రమాదాలాను తగ్గించడానికి దీనిలో ఉండే డీలైమొనేన్ సహాయపడుతుంది. నిమ్మ తొక్కలను వంటగదిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు.
నిమ్మ తొక్కల్లో కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించే గుణాలుంటాయి. నిమ్మ తొక్క నోటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు హార్ట్ ప్రాబ్లమ్స్ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మకాయ తొక్కను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు, నల్లని మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. గాల్ బ్లాడర్‌లో రాళ్ల సమస్యను నివారించేందుకు నిమ్మ తొక్కలతో తయారు చేసిన పొడి ఉపయోగపడుతుంది. నిమ్మ తొక్కల్లోని విటమిన్ సి తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగేలా చేస్తోంది.
ఎండబెట్టిన నిమ్మ తొక్కలను గ్రీన్ టీ ఇంకా అలాగే హెర్బల్ టీ లో కలిపి తీసుకుంటే దంత సమస్యలు తగ్గుతాయి. ఒక చెంచా నిమ్మ పండు లో తగినన్ని పాలు కలిపి బాగా పేస్ట్ లా తయారు చేసి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో నీట్ గా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం చాలా కాంతివంతంగా తయారవుతుంది.