Lemon Water : వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే నిమ్మకాయ నీరు!

నిమ్మకాయను దంతాల మీద రుద్దడం వల్ల వాటిని కాంతివంతం చేస్తుంది. దుర్వాసన తగ్గిస్తుంది. అయితే నిమ్మరసం తలపై అప్లై చేయడం వల్ల చుండ్రు ,జుట్టు రాలడం వంటి సమస్యలకు తొలగుతాయి.

Lime Water

Lemon Water : నిమ్మకాయ గురించి మనందరికీ తెలుసు. నిమ్మకాయలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈపండు చేసే మేలు అంతా ఇంతా కాదు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క నిమ్మకాయ రసంలో మన రోజువారీ అవసరాలలో 50 శాతం కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. నోరు, చర్మం, ఊపిరితిత్తులు, రొమ్ము, కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్‌ల నుండి రక్షిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి , పెంచడానికి,బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. పప్పులు, ఆకు కూరల నుండి ప్రోటీన్,ఐరన్‌ను శరీరం గ్రహించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది మన జుట్టు మరియు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది, చర్మానికి సంబంధించిన ఏవైనా రుగ్మతలు కూడా నశిస్తాయి. ఉదయం నిమ్మకాయ నీరు తాగటం వల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. నిమ్మకాయ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. కాబట్టి వేసవి రోజుల్లో ప్రతి రోజూ నిమ్మరసం తాగాలి. మీరు ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి, గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగితే, అది మనకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది,నిమ్మకాయ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది, వేసవి కాలంలో వేడి నీటిలో, తేనె, నిమ్మరసం కలుపుకుని రోజూ తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు.

నిమ్మలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, కాపర్, జింక్, ఐరన్ మరియు మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మకాయలు శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచి సాధారణ ఇన్‌ఫెక్షన్‌లకు నిరోధకత పెంచుతాయి. నిమ్మకాయను గోరువెచ్చని నీటిలో పిండి, ఉదయం నిద్రలేచిన వెంటనే తాగితే దీని వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అసిడిటీతో బాధపడేవారు, అజీర్ణం మరియు మలబద్ధకం సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నవారు నిమ్మరసం తాగాటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇది అద్భుతమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. నిమ్మరసం వేడి నీటిలో కలిపినప్పుడు జీర్ణక్రియ సమస్యలను కూడా నయం చేస్తుంది,

పిత్తం, వికారం, గుండెల్లో మంట మరియు మలబద్ధకం దిగువ ప్రేగులలో లోపాలు ఉన్నా బాగా సహాయపడుతుంది. మూత్రవిసర్జన సమస్యలకు  పనిచేస్తుంది. మూత్రమార్గంలో సమస్యలు , అంటువ్యాధులు, ఆర్థరైటిస్ లేదా రుమాటిజం వంటి అధిక యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది శరీరం నుండి విషాన్ని బ్యాక్టీరియాను బయటకు పంపడంలో సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ సి లోపం ఉన్నప్పుడు, స్కర్వీ వ్యాధి బారిన పడే అవకాశాలుంటాయి.

సాంప్రదాయకంగా వేడి నీటిలో నిమ్మరసం , ఒక టీస్పూన్ తేనె కలిపిన పానీయం జలుబు చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసం తేనె, పసుపు కలిపి తీసుకోవటం వల్ల గొంతు నొప్పి, ఉక్కిరిబిక్కిరి చేయడం, పిల్లికూతలు, టాన్సిల్స్, ఆస్తమా నుండి ఉపశమనం పొందవచ్చు. నిమ్మకాయను దంతాల మీద రుద్దడం వల్ల వాటిని కాంతివంతం చేస్తుంది. దుర్వాసన తగ్గిస్తుంది. అయితే నిమ్మరసం తలపై అప్లై చేయడం వల్ల చుండ్రు ,జుట్టు రాలడం వంటి సమస్యలకు తొలగుతాయి. వేసవిలో చర్మంపై వచ్చే జిడ్డు, మొటిమలు, ముడతలు, బ్లాక్ హెడ్స్‌కి కూడా మంచి నివారణకారిణిగా పనిచేస్తుంది. వేసవిలో, ఒక నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసు చల్లటి నీళ్లలో రాళ్ల ఉప్పు కలిపి తీసుకుంటే తక్షణమే రిఫ్రెష్ అవ్వొచ్చు.