Liver Infections : హెపటైటిస్ నుంచి కాలేయాన్ని కాపాడుకుందాం

హెపటైటిస్ ను ఎంత ముందుగా గుర్తిస్తే, లివర్ డ్యామేజీ కాకుండా అంత ఎక్కువగా కాపాడవచ్చు. హెపటైటిస్ సి ని పూర్తిగా నయం చేయవచ్చు. శరీరంలో దాని నామరూపాలు లేకుండా చేయగలిగే మందులు ఉన్నాయి. అయితే హెపటైటిస్ బి వైరస్ ను మాత్రం పూర్తిగా తొలగించలేం.

hepatitis

Liver Infections : వర్షాకాలంలో వైరల్ ఇన్ ఫెక్షన్లను ఎన్నింటినోచూస్తుంటాం. దోమలు, ఈగల ద్వారా వచ్చే వ్యాధులు ఒక ఎత్తయితే కలుషిత ఆహారం, నీటి ద్వారా వచ్చే ఇన్ ఫెక్షన్లు మరో ఎత్తు. వీటిలో కామన్ గా కనిపించేవిహెపటైటిస్ ఇన్ ఫెక్షన్లు. కొన్ని హెపటైటిస్ ఇన్ ఫెక్షన్లు సీజన్ తో సంబంధం లేకుండా కూడా వస్తుంటాయి. ఇవి మరింత ప్రమాదం. కాలేయానికి ఎసరు పెట్టే ఈ హెపటైటిస్ ఇన్ ఫెక్షన్ల గురించి వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా….యశోద హాస్పిటల్, హైదరాబాద్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్&హెపటాలజిస్ట్. డాక్టర్ కె. ఎస్. సోమశేఖర్ రావు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : High Blood Pressure : హైబీపీ మీ గుండెను మాత్రమే కాదు.. మూత్రపిండాలు, కాలేయంపై కూడా ప్రభవం చూపిస్తుంది

హెపటోసెల్స్ అంటే కాలేయ కణాలు. కాలేయానికి వాపు కలిగించే ఇన్ ఫెక్షన్ల కాబట్టి ఈ వైరల్ ఇన్ ఫెక్షన్లను హెపటైటిస్అంటాం. ప్రధానంగా ఇవి నాలుగు రకాల వైరస్ ల వల్ల వస్తుంటాయి. హెపటైటిస్ ఎ, బి, సి, ఇ. హెపటైటిస్ ఎ, ఇ ఇన్ ఫెక్షన్లు ఈ వర్షాకాలంలో చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి.

హెపటైటిస్ ఎ, ఇ

రోడ్డు మీద పానీపూరీనో, రోడ్డు మీద బండిపై దొరికే ఇంకేదైనా ఫాస్ట్ ఫుడ్డో.. ఇలా వర్షాకాలంలో బయటి తిండి తిన్నప్పుడు లేక, నీటి ద్వారా గానీ ఈ ఇన్ ఫెక్షన్లు వస్తుంటాయి. ఇలాంటప్పుడు ఇన్ ఫెక్షన్ రాగానే జ్వరం, కామెర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నపిల్లలకు కూడా ఇవి రావచ్చు. కలుషితమైన ఆహారం లేదా నీరు తీసుకున్నప్పుడు పొట్టలోకి చేరిన ఇన్ ఫెక్షన్ లివర్ పై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా హెపటైటిస్ ఎ, ఇ ఇన్ ఫెక్షన్లు 99 శాతం వరకు సెల్ఫ్ లిమిటింగ్ గా ఉంటాయి. అంటే ఒక పదిహేను రోజుల్లోగావాటికవే తగ్గిపోతాయి. అరుదుగా తీవ్రం కావొచ్చు. కానీ మందుల ద్వారా తగ్గించవచ్చు.

READ ALSO : మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తీసుకుంటే మేలు!

హెపటైటిస్ బి, సి

మనదేశంలో 2.5 శాతం మందికి హెపటైటిస్ బి, 1 శాతం మందికి హెపటైటిస్ సి ఉందని అంచనా. ఈ రకమైన హెపటైటిస్ ఇన్ ఫెక్షన్లు పేరెంటరల్ ట్రాన్స్ మిషన్ ద్వారా వస్తాయి. అంటే సాధారణంగా ఒకరి నుంచి ఒకరికి రక్తం ద్వారా సోకుతాయి.

1.స్టెరిలైజ్ చేయని రేజర్లు ఒకరివి ఒకరు వాడినప్పుడు

2. సర్జికల్ లేదా డెంటల్ ఇన్ స్ట్రుమెంట్స్స్టెరిలైజ్ చేయకుండా వాడినప్పుడు

3. టాటూలు వేయడానికి ఒకరికి వాడిన సూది ఇంకొకరికి వాడినప్పుడు ఈ ఇన్ ఫెక్షన్లు సోకుతాయి.

4. మరో ముఖ్య కారణం లైంగిక కలయిక. సురక్షితం కాని సెక్సువల్ కాంటాక్ట్ వల్ల కూడా ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.

5. తల్లికి హెపటైటిస్ బి లేదా సి ఇన్ ఫెక్షన్ ఉంటే డెలివరీ అయ్యేటప్పుడు పుట్టే బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ.

READ ALSO : Diabetes : మధుమేహులు కాలేయం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

లక్షణాలు

హెపటైటిస్ ఎ, ఇ ఉన్నప్పుడు కామెర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ బి గానీ సి గానీ ఉంటే చాలావరకు లక్షణాలుండవు. ఇవి సైలెంట్ గా సోకుతాయి. టెస్ట్ చేస్తే తప్ప తెలియదు. నెమ్మదిగా లివర్ డ్యామేజీఅయ్యేవరకుహెపటైటిస్ బి లేదా సి ఇన్ ఫెక్షన్ ఉన్నట్టు తెలియదు. ఇందుకోసం సాధారణంగా 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు లివర్ ఫైబ్రోసిస్, సిర్రోసిస్ రావచ్చు. లివర్ ఫంక్షన్ పూర్తిగా దెబ్బతినొచ్చు. అప్పుడు కూడా సరైన చికిత్స అందకపోతే లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు.

READ ALSO : Fatty Liver Problem : ఫ్యాటీ లివర్ సమస్య మానసిక ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలుసా ?

ఏం చేయాలి?

హెపటైటిస్ బి, సి రాకుండా ఉండాలన్నా, కాంప్లికేట్ కాకుండా ఉండాలన్నా ఎవరికి వారు స్వచ్ఛందంగా హెపటైటిస్ టెస్టులు చేయించుకోవడం మంచిది. హెపటైటిస్ బి కి హెచ్ బిఎస్ఎజి అనే టెస్టు, హెపటైటిస్ సి కి యాంటీ హెచ్ సివి టెస్టు ఉంటాయి. వీటిని ఎప్పుడైనా ఎవరైనా చేయించుకోవచ్చు.

హెపటైటిస్ బి కి వాక్సిన్ అందుబాటులో ఉంది. ఇది మూడు డోసులు వేసుకుంటే హెపటైటిస్ రాకుండా నివారించొచ్చు. హెపటైటిస్ సి కి వాక్సిన్ లేకపోయినప్పటికీ ఒకసారి టెస్టు చేయించుకుని, నెగటివ్ వచ్చిన తర్వాత అది సోకకుండా జాగ్రత్తపడితే సరిపోతుంది.

READ ALSO : మీ కాలేయం శుభ్రపడాలంటే ఈ ఆహారాలను తీసుకోండి!

చికిత్స

హెపటైటిస్ ను ఎంత ముందుగా గుర్తిస్తే, లివర్ డ్యామేజీ కాకుండా అంత ఎక్కువగా కాపాడవచ్చు. హెపటైటిస్ సి ని పూర్తిగా నయం చేయవచ్చు. శరీరంలో దాని నామరూపాలు లేకుండా చేయగలిగే మందులు ఉన్నాయి. అయితే హెపటైటిస్ బి వైరస్ ను మాత్రం పూర్తిగా తొలగించలేం. కానీ వైరస్ లోడ్ తగ్గించే మంచి మందులున్నాయి. వైరస్ లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే లివర్ పై దాని ప్రభావం గానీ, ఇతరులకు సోకే అవకాశం గానీ ఉంటుంది. అందువల్ల వైరస్ లోడ్ తగ్గించే మందులు వాడితే ఈ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.

ట్రెండింగ్ వార్తలు