Diabetes : మధుమేహులు కాలేయం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

రక్తంలో చక్కెర స్ధాయిలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. పోషక ఆహారాన్ని తీసుకోవాలి. జంక్, ప్రాసెస్ చేసిన చక్కెరతో కూడిన ఆహారాలను నివారించాలి. తృణధాన్యాలు, తాజా పండ్లు మరియు కూరగాయలు మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

Diabetes : మధుమేహులు కాలేయం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Precautions to be taken in the case of diabetes liver!

Diabetes : టైప్ 2 డయాబెటిస్ అనేది శరీరం చక్కెరను ఎలా జీవక్రియ చేస్తుందో ప్రభావితం చేసే దీర్ఘకాలిక పరిస్థితి. శరీరం ఇన్సులిన్‌కు నిరోధకతను కలిగి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇది కాలేయ వ్యాధితో సహా ఇతర సమస్యలకు దారి తీస్తుంది. అనేక సందర్భాల్లో, కాలేయ వ్యాధి గుర్తించదగిన లక్షణాలను కలిగి ఉండదు. దీని వల్ల ముందస్తు చికిత్స పొందడం కష్టతరంగా మారుతుంది.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిని కాలేయ వ్యాధి ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?

మధుమేహం అనేది సైలెంట్ కిల్లర్. మధుమేహంతో బాధపడుతున్నవారు కాలేయం విషయంలో జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. శరీరం ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉన్న సందర్భంలో కాలేయ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ కీలకమైన అవయవంపై ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడం వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఇది చివరకు లివర్ సిర్రోసిస్ కు దారి తీయటం ద్వారా లివర్ పూర్తిగా దెబ్బతింటుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు ;

రక్తంలో చక్కెర స్ధాయిలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. పోషక ఆహారాన్ని తీసుకోవాలి. జంక్, ప్రాసెస్ చేసిన చక్కెరతో కూడిన ఆహారాలను నివారించాలి. తృణధాన్యాలు, తాజా పండ్లు మరియు కూరగాయలు మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామాలు చేయాలి. స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా, జిమ్మింగ్, ఏరోబిక్స్, రన్నింగ్ లేదా జాగింగ్ వంటి వ్యాయామాలుగా ఎంచుకోవాలి.

అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సోడియం, కెఫిన్‌లను తగ్గించండి. ధూమపానం ,మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది. కోలాలు, సోడాలు, పండ్ల రసాలు, స్వీట్లు, బేకరీ వస్తువులు, క్యాండీలు తీసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు