Fatty Liver Problem : ఫ్యాటీ లివర్ సమస్య మానసిక ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలుసా ?

ఫ్యాటీ లివర్ సమస్య కాలేయం సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. కాలేయం హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బంది ఏర్పడినప్పడు, అది భావోద్వేగ అస్థిరత , అధిక ఒత్తిడి ప్రతిస్పందనలకు కారణం అవుతుంది.

Fatty Liver Problem : ఫ్యాటీ లివర్ సమస్య మానసిక ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలుసా ?

fatty liver

Fatty Liver Problem : నీరసంగా, అలసటగా, చిరాకుగా అనిపిస్తుంటే దానిని లక్షణాలను బట్టి ఫ్యాటీ లివర్ సమస్య కారణమై ఉండవచ్చు. కాలేయంలో కొవ్వు అధికంగా చేరడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, శ్రద్ధ తగ్గడం, నిద్రకు భంగం కలిగించడం వంటి మానసిక ఆరోగ్య లక్షణాలు తలెత్తుతాయి.

READ ALSO : Liver : మీ కాలేయం శుభ్రపడాలంటే ఈ ఆహారాలను తీసుకోండి!

సాధారణంగా కాలేయం జీర్ణక్రియ కోసం పిత్త ఉత్పత్తి, రక్తం వడపోత , విష పదార్థాలను విచ్ఛిన్నం చేయడం వంటి విధులను నిర్వర్తిస్తుంది. ఈ కీలకమైన అవయవం సరిగ్గా పని చేయకపోతే, అది గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధులు, అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

అనారోగ్యకరమైన జీవనశైలిని, మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే మద్యపానం వల్ల ఎక్కువ మంది ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రజారోగ్య సమస్యగా మారింది.

ఇది భారతదేశంలోని మూడింట ఒక వంతు మంది పెద్దల్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది మధుమేహం, ఊబకాయం, అధిక రక్తం ఉన్నవారిలో సాధారణం. కొలెస్ట్రాల్ అనేది వీటితో సంబంధంలేకుండానే అభివృద్ధి చెందుతుంది.

READ ALSO : Liver Health : కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు ఇవే! వీటిని రోజువారిగా తీసుకుంటే మీ కాలేయం సురక్షితం!

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రోగులు వారి కాలేయంలో అధిక కొవ్వును కలిగి ఉంటారు.ఇది చివరి దశ కాలేయ వ్యాధి సిర్రోసిస్ , కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తుంది. వ్యాధి ముదిరి దశకు చేరుకునే వరకు రోగులకు దాని గురించి తెలియదు. కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలు కనిపించవు.

కాలేయ వ్యాధి ప్రమాదం వల్ల చాలా మంది రోగులకు మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో డిప్రెషన్, ఆందోళన, నిద్ర ఆటంకాలు, అభిజ్ఞా క్షీణత ,ఆత్మహత్య ఆలోచనలు వంటి మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా స్లీప్ అప్నియా , నిద్రలేమి, నిద్రకు ఆటంకాలు కారణంగా నిద్ర పట్టని సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.దీని వలన రోజంతా అలసట, చికాకు కలిగించే ప్రవర్తన, ఏకాగ్రత సామర్థ్యం తగ్గటం, జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం, శ్రద్ధ తగ్గటం జరుగుతుంది. సమస్య-పరిష్కారంలో ఇబ్బంది, కాలేయ వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ ఇది మరింత తీవ్రమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు, స్థూలకాయంకు దారితీసే అనారోగ్యకరమైన జీవనశైలి, క్రమంగా ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నవారిపై తీవ్రప్రభావం చూపి అనేక సమస్యలకు దారితీస్తుంది.

READ ALSO : Radish : మూత్రపిండాలు, లివర్ ఆరోగ్యానికి ముల్లంగి

ఫ్యాటీ లివర్ సమస్య మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే మార్గాలు ;

1. హార్మోన్ల అసమతుల్యత ; ఫ్యాటీ లివర్ సమస్య కాలేయం సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. కాలేయం హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బంది ఏర్పడినప్పడు, అది భావోద్వేగ అస్థిరత , అధిక ఒత్తిడి ప్రతిస్పందనలకు కారణం అవుతుంది. ఈ అసమతుల్యత మానసిక కల్లోలం, ఆందోళన , నిరాశకు కారణమవుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

2. అభిజ్ఞా క్షీణత ; ఫ్యాటీ లివర్ వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, దృష్టి తగ్గటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాలేయం వివిధ రసాయనాలు మరియు పోషకాల స్థాయిలను నియంత్రించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది. దాని సామర్ధ్యం తగ్గినప్పుడు ఆరోగ్యం, అభిజ్ఞా సామర్ధ్యాల పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

READ ALSO : Coffee-Liver Disease : కాఫీతో ప్రాణాంతక లివర్ వ్యాధికి చెక్!

3. నిద్రకు ఆటంకం ; స్లీప్ అప్నియా, నిద్రలేమి వంటి నిద్ర రుగ్మతలు ఫ్యాటీ లివర్ సమస్యతో సంబంధం కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కాలేయం పునరుద్ధరణ నిద్ర సహాయపడుతుంది. కాబట్టి నిద్రలేకపోవటం అన్నది మానసిక ఆరోగ్య సమస్యలను పెంచుతుంది, ఒత్తిడి, ఆందోళన , నిరాశతో సహా, అలాగే మెదడు ఆలోచన పనితీరును బలహీనపరుస్తుంది.

4. అలసట ; శక్తి ఉత్పత్తికి కాలేయం అవసరం, దాని పనితీరు బలహీనమైనప్పుడు, అది నిరంతర అలసటను కలిగిస్తుంది. కొవ్వు కాలేయం ఉన్న వ్యక్తులు తరచుగా దీర్ఘకాలిక అలసటను అనుభవిస్తారు. ఇది రోజువారీ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. ఇది నిరాశ, నిస్పృహ భావాలకు దారితీస్తుంది, ఆందోళన రేకెత్తిస్తుంది.

READ ALSO : Amla : లివర్ సమస్యలకు ఉసిరికాయలతో చెక్

5. సామాజిక ఒంటరితనం ; ఫ్యాటీ లివర్‌ శారీరక లక్షణాలు మానసిక ఒత్తిడి, సామాజిక ఒంటరితనానికి దారి తీస్తుంది. ఒంటరితనం భావాలను తీవ్రతరం చేస్తుంది. మానసిక ఆరోగ్య పరిస్థితులను మరింత దిగజారుస్తుంది. మానసిక శ్రేయస్సును మరింత ప్రభావితం చేస్తుంది.

ఫ్యాటీ లివర్ సమస్య హార్మోన్ల అసమతుల్యత, అభిజ్ఞా క్షీణత, నిద్ర భంగం, అలసట మరియు సామాజిక ఒంటరితనంతో సహా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నవారు వైద్యుల సూచనలు పాటిస్తూ మానసిక అంశాలను , జీవనశైలి మార్పులను అనుసరించటం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు.