Coffee-Liver Disease : కాఫీతో ప్రాణాంతక లివర్ వ్యాధికి చెక్!
కాఫీ తాగుతున్నారా? రోజుకు ఎన్నిసార్లు తాగుతున్నారు? రోజుకూ ఎన్ని కప్పుల కాఫీ తాగుతారు.. రోజుకు మూడు లేదా నాలుగు కప్పుల కాఫీ తాగేవారిలో ప్రాణాంతక లివర్ వ్యాధి ముప్పు తగ్గిందని బ్రిటిష్ సైంటిస్టులు వెల్లడించారు.

Coffee In Moderation Cuts Risk Of Deadly Liver Disease, Study Shows
Coffee Risk Liver Disease : కాఫీ తాగుతున్నారా? రోజుకు ఎన్నిసార్లు తాగుతున్నారు? రోజుకూ ఎన్ని కప్పుల కాఫీ తాగుతారు.. రోజుకు మూడు లేదా నాలుగు కప్పుల కాఫీ తాగేవారిలో ప్రాణాంతక లివర్ వ్యాధి ముప్పు తగ్గిందని బ్రిటిష్ సైంటిస్టులు వెల్లడించారు. ఇడిన్ బర్గ్, సౌతాంప్టన్ యూనివర్శిటీలకు చెందిన రీసెర్చర్లు 50 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య డేటాపై లోతుగా అధ్యయనం చేశారు.
అసలు కాఫీ తాగనివారిలో కంటే.. ఏ రకమైన కాఫీ తాగిన వారిలోనైనా దీర్ఘకాలిక లివర్ వ్యాధి ముప్పు తగ్గినట్టు అధ్యయనంలో తేలిందని అంటున్నారు. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన రీసెర్చర్ Oliver Kennedy ప్రకారం.. కాఫీ రోజు తాగడం వల్ల దీర్ఘ కాలిక కాలేయ వ్యాధులు రాకుండా అద్భుతమైన నివారిణిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన కాలేయం కోసం.. ప్రతిరోజు డైట్‌లో cuppa joe చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కాఫీ ప్రియుల్లో 20 శాతం దీర్ఘకాలిక కాలేయ వ్యాధి లేదా ఫ్యాటీ లివర్ వ్యాధితో 49 శాతం ముప్పు తగ్గినట్టు తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు కప్పులు టీ తాగిన వారిలో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని పరిశోధక బృందం తేల్చింది.