Liver Health : కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు ఇవే! వీటిని రోజువారిగా తీసుకుంటే మీ కాలేయం సురక్షితం!

బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీస్ స్ట్రాబెర్రీస్ వంటి వివిధ రకాల బెర్రీ లలో అధిక భాగం పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి ఇవి కాలేయానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా, కాలేయం దెబ్బ తినకుండా రక్షిస్తుంది.

Liver Health : కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు ఇవే! వీటిని రోజువారిగా తీసుకుంటే మీ కాలేయం సురక్షితం!

These are the foods that protect liver health! Taking these daily is safe for your liver!

Liver Health : శరీర అవాయవాలన్నింటిలో కాలేయం అతి పెద్దది. మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉన్న కార్బోహైడ్రేట్లను విచ్చిన్నం చేయడానికి, గ్లూకోస్ తయారుచేయడానికి కాలేయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా కాలేయం పోషకాలను నిల్వచేసుకొని పిత్తాన్ని కలిగిస్తుంది. కాలేయం ఆరోగ్యవంతంగా పనిచేసినప్పుడే మనం తీసుకునే ఆహార పదార్థాలను సరైన క్రమంలో జీర్ణం చేసి అందులో ఉన్న పోషకాలను రక్తంలోకి ప్రవహించేలా చేస్తుంది. మన శరీరంలో ఉండే కాలేయం సరైన క్రమంలో పనిచేయకపోతే ఎన్నో జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పదార్ధాలు ఎంతగానో తోడ్పడతాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. బీట్‌రూట్: ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

2. వెల్లుల్లి: భారతీయ వంటింట్లో దొరికే వాటిలో వెల్లుల్లి కీలకమైనది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మన ఆహార పదార్థాలలో భాగంగా వెల్లుల్లిని చేర్చడం వల్ల ఇది మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వెల్లుల్లిలో అధికభాగం యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది కాలేయానికి ప్రమాదం కలిగించే బ్యాక్టీరియాల నుంచి రక్షిస్తుంది. ఇది కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది. ఇందులో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపటంలో తోడ్పడుతుంది.

3. ఆకుపచ్చ కూరగాయలు: కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్‌లు ఉంటాయి.

4. సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

5. బెర్రీస్: బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీస్ స్ట్రాబెర్రీస్ వంటి వివిధ రకాల బెర్రీ లలో అధిక భాగం పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి ఇవి కాలేయానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా, కాలేయం దెబ్బ తినకుండా రక్షిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి రోజు ఈ బెర్రీస్ తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. కాలేయ కణాలు, ఎంజైమ్‌లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షిస్తుంది.

6. గ్రీన్ టీ: కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో అధికభాగం యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇవి కాలేయ ఆరోగ్యాన్ని ఉంచడంలో దోహదపడతాయి. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

7. పసుపు: ఇది వాపు మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా కాలేయ వ్యాధులను నివారిస్తుంది.

8. ఆలివ్ ఆయిల్: అధిక మొత్తంలో కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు తినడం కాలేయానికి మంచిది కాదు. ఒక అధ్యయనం ప్రకారం మన ఆహార పదార్థాలలో భాగంగా ఆలివ్ ఆయిల్ తీసుకోవటంవల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి కాలేయ పనితీరు మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

9. గింజలు: సాధారణంగా గింజలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది మన శరీరంలో ఏర్పడే మంటను తొలగించడంతో పాటు, ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో వాల్నట్, బాదం వంటి కొన్ని గింజలను తినడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.