Longer 8 Week Gap Between Pfizer Doses Boosts Antibodies
8-Week Gap Pfizer Doses Antibodies : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు (Covid-19 Vaccines) అందుబాటులోకి వచ్చేశాయి. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ కూడా ఆయా దేశాల్లో కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా తీవ్రతను మరణ ముప్పును తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. అయితే.. ఏయే వ్యాక్సిన్లతో ఎంతకాలం యాంటీబాడీలు ఉంటాయంటే.. ఒక్కో వ్యాక్సిన్ పనితీరును బట్టి వాటి యాంటీబాడీల స్థాయిలు వేర్వేరుగా ఉంటాయి. అదే.. ఫైజర్ ఇంక్. బయోటెక్ SE అభివృద్ధిచేసిన ఫైజర్ కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ ఆధారంగా యాంటీబాడీలు పెరుగుతున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది.
రెండు డోసుల మధ్య తక్కువ వ్యవధితో పోలిస్తే.. 8 వారాల నుంచి 10 వారాల మధ్య రెండు డోసులు పూర్తి అయిన వారిలో (Pfizer Doses Antibodies) యాంటీబాడీలు అధికంగా పెరిగాయని యూకే అధ్యయనంలో రుజువైంది. రెండు డోజుల మధ్య గ్యాప్ ఎనిమిది వారాలు సరిపోతాయని అంటున్నారు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో అధ్యయన ప్రొఫెసర్ Susanna Dunachie అభిప్రాయపడ్డారు. బ్రిటన్ లో డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోతున్న వేళ.. టీకా డోసుల మధ్య తక్కువ ఉండాలంటూ చర్చలు కొసాగాయి. ఈ నేపథ్యంలో అప్పటివరకూ డోసుల మధ్య గ్యాప్ 12 రోజుల నుంచి 8 రోజులకు తగ్గించారు.
అదే.. ఫైజర్ వ్యాక్సిన్ విషయానికి వస్తే.. డోసుల మధ్య గ్యాప్ మూడు వారాల నుంచి 10 వారాల మధ్య అధిక యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు రీసెర్చర్లు గుర్తించారు. దీర్ఘకాలం గ్యాప్ ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు కనిపించాయని చెబుతున్నారు. మూడు వారాల వ్యవధిలో 10 వారాల విరామం తర్వాత యాంటీబాడీ స్థాయిలు రెట్టింపు అధికంగా ఉన్నాయి. ఇందులో డెల్టా పరీక్షించిన అన్ని ఇతర రకాలు యాంటీబాడీలు ఉన్నాయి. రోగనిరోధక శక్తికి సాయపడే టి కణాల ప్రతిస్పందనను మెరుగుపరిచినట్టు కనుగొన్నారు. మొదటి, రెండు డోసులు మధ్య గ్యాప్ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు రెండింటి మధ్య యాంటీబాడీలు స్థాయిలు క్షీణించినట్టు గుర్తించారు.