Lose Weight : బరువు తగ్గాలనుకునే వారు కలబంద రసంతో!

కలబంద రసంలో ఉండే ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ శరీర భాగాల్లోని పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. బాడీ మాస్ ఇండెక్స్‌ను తగ్గిస్తుంది. రోజువారీ డైట్‌లో దీన్ని భాగం చేసుకుంటే సులభంగా బరుతు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Lose Weight : బరువును తగ్గించడంలో కలబంద సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలన్నింటినీ కలబంద అందిస్తుంది. కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. ప్రాచీనకాలం నుంచి కలబందను పలు చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. దీనిలో ఎ, బి, సి, ఇ విటమిన్లతోపాటు 18 రకాల అమైనో ఆసిడ్లుంటాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా బరువును తగ్గేలా చేస్తుంది.

కలబంద రసంలో ఉండే ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ శరీర భాగాల్లోని పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. బాడీ మాస్ ఇండెక్స్‌ను తగ్గిస్తుంది. రోజువారీ డైట్‌లో దీన్ని భాగం చేసుకుంటే సులభంగా బరుతు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కలబందలోని ఫైటో స్టెరాల్స్ జీవక్రియ రేటును రెట్టింపు చేస్తుంది. దీని వల్ల శరీరంలోని అదనపు కొవ్వు ఖర్చవుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. అలోవెరాలో ఉన్న డిటాక్సిఫైయింగ్ గుణాల కారణంగా బరువు సులువుగా తగ్గించడంలో సహాయపడుతుంది. ఎసిడిటీ, గ్యాస్‌, కడుపుబ్బరం వంటి సమస్యలున్న వారికీ చక్కని పరిష్కారం. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడమేకాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

బరువు తగ్గటం కోసం కలబందను ఇలా తీసుకోండి ;

కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ కలబంద రసం, టేబుల్ స్పూన్ అల్లం రసం వేసి సన్నని మంటపై వేడి చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు క్రమేపీ తగ్గుతుంది. బరువు తగ్గడానికి కలబంద రసాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే ఉసిరి, తులసితో కలిపి తీసుకుంటే శరీరం తేలికగా ఉండేలా చేస్తుంది. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో నిమ్మకాయ రసాన్ని కలపాలి. దానిలో ఒక టీస్పూన్ అలోవెరా జెల్‌ వేయాలి. దీనిని కాస్త వేడి చేసి అందులో ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగాలి. ఇలా ఈ ద్రవణాన్ని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు