Garlic Tea : వెల్లుల్లి టీ తో బోలెడు ప్రయోజనాలు… మీకు తెలుసా!..

వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు మన శరీర బరువును నియంత్రించడానికి దోహదపడతాయి. అలాగే రక్తప్రసరణను వేగవంతం చేసి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.

Garlic Tea (2)

Garlic Tea : కరోనా నేపధ్యంలో చాలా మంది రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వివిధ రకాల పానీయాలను సేవించి ఉంటారు. అయితే అలాంటి వాటిలో వెల్లల్లితో తయారు చేసిన టీ గురించి చాలా మందికి తెలిసి ఉండదు. వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయన్న విషయం తెలిసి ఉన్నప్పటికీ దీనితో టీ తయారు చేసుకుని తాగవచ్చని మాత్రం అతికొద్దిమందికి మాత్రమే తెలసుంటుంది. వెల్లుల్లిని వేల సంవత్సరాల నుంచి మన ఆహారంలో భాగమైపోయింది. వంటకు రుచి ఇవ్వడమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి.

వెల్లుల్లి టీని తయారు చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనికూడా లేదు. చిటెకెలో చక్కని సువాసన భరితమైన వెల్లుల్లి టీని తయారు చేసుకుని ఏంచక్కా తాగవచ్చు. ఇందుకుగాను ఒక గ్లాసు నీరు మరిగించి అల్లం, వెల్లుల్లి కలపాలి. దీని తరువాత, 20 నిమిషాలు ఉడకబెట్టండి. నీరు ఉడికిన తర్వాత ఫిల్టర్ చేయండి. తరువాత, తేనె, నిమ్మకాయ రసాన్ని తగినంత కలుపుకోవాలి, నాలుగు పుదీనా ఆకులను కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కని వెల్లుల్లి టీని పెట్టుకోవచ్చు.

వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. దీనివల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగవ్వటంతోపాటు, కొవ్వు కరిగించేందుకు దోహదపడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ , ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలతో బాధపడేవారు ఈ టీబాగా ఉపయోగపడుతుంది. సాధారణ టీ కన్నా, వెల్లుల్లి టీని తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు తొలగించడంలో వెల్లుల్లి టీ బాగాపనిచేస్తుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు మన శరీర బరువును నియంత్రించడానికి దోహదపడతాయి. అలాగే రక్తప్రసరణను వేగవంతం చేసి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. ఉదర సమస్యలతో బాధపడేవారు, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి టీ తాగటం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. వెల్లుల్లి టీ ఘాటుగా ఉంటుందని భావించేవారు వెల్లుల్లి టీ లోకి కొద్దిగా తేనె కలుపుకుని తాగినా ఈ విధమైనటువంటి ప్రయోజనాలను పొందవచ్చు.

కరోనాతోపాటు ఇతర వ్యాధుల నుండి రక్షణ పొందేందుకు వెల్లుల్లి టీ తాగటం  మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిలోనే దీనిని తయారు చేసుకునేందుకు వీలుంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో ప్రాధాన్యత కలిగి ఉన్న వెల్లుల్లి టీ త్రాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు.