అర్రె.. జ్వరం వస్తే కూడా ఇంత మంచి జరుగుతుందా?.. కొత్త సర్వే అసలు సూపర్..

నిపుణుల అభిప్రాయం ప్రకారం మన శరీరంలో వీటిని ఎదుర్కోవడానికి అపుడప్పుడు జ్వరం వస్తే మంచిదేనట..

PC:shutterstock

జ్వరం వస్తే శారీరకంగా, మానసికంగా కొంత అసౌకర్యం కలుగుతుందన్న విషయం మనకు తెలిసిందే. శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల అలసట, నీరసం, ఆకలి కోల్పోవడం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే, ఆరోగ్య నిపుణుల ప్రకారం, అప్పుడప్పుడు జ్వరం రావడం శరీరానికి మంచిదేనని తాజా పరిశోధనల్లో తేలింది.

జ్వరం అనేది శరీర రక్షణ వ్యవస్థలో ఒక భాగం. వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి హానికారక సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించినప్పుడు, మన ఇమ్యూనిటీ సిస్టమ్ (రోగనిరోధక శక్తి) వాటిని ఎదుర్కోవడానికి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ టెంపరేచర్ హానికరమైన సూక్ష్మజీవులను నశింపజేయడంలో సహాయపడుతుంది.

Also, Read:హార్ట్ ఎటాక్ రావడానికంటే ముందే బెల్ కొడుతుంది.. ఈ 7 లక్షణాల్లో ఏది కనిపించినా అలర్ట్ అవ్వండి..

ఇటీవల వెలువడిన ఆరోగ్య సర్వే ప్రకారం, అప్పుడప్పుడు జ్వరం రావడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు, భవిష్యత్తులో ఎదురయ్యే ఇతర వ్యాధులను ఎదుర్కోవడానికి ఇమ్యూనిటీని పవర్ ని పెంచుకుంటుంది. అంటే, మన శరీరం చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను ఎదుర్కొంటూ, ముందుగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటుంది. దీని వలన భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం తగ్గుతుంది.

అయితే, దీని అర్థం అనవసరంగా జ్వరం రావడం మంచిదనే కాదు. అధిక ఉష్ణోగ్రత, దీర్ఘకాలిక జ్వరం, ఇతర తీవ్ర లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించడం అవసరం. అంతేకాకుండా, ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర, డైలీ వర్కౌట్ ద్వారా మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బలంగా ఉంచుకోవడం ఉత్తమం. కాబట్టి, జ్వరం వచ్చినప్పుడు భయపడకుండా, దాన్ని శరీరం సహజ రక్షణ చర్యగా గుర్తించి, సమయానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.

Disclaimer: మేము ఇందులో ఉన్న విషయాలను ధ్రువీకరించలేదు.. కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యడానికి మాత్రమే ఈ ఆర్టికల్ ని పోస్ట్ చేశాము. ఏమైనా అనుమానాలు ఉంటే మంచి డాక్టర్ ని సంప్రదించండి