Woman Marries
Marrying With Trees : ప్రేమ అనేది అనిర్వచనీయమైనది. హద్దులేని ప్రేమ ఎలా పుడుతుందో..ఎప్పుడు పుడుతుందో…ఎవరిపై పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మనుషులు, జంతువులు, ప్రకృతి ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టిలోని ప్రతి జీవి తమ ప్రేమను ఏదో ఒక సమయంలో వ్యక్తపరుస్తూనే ఉంటుంది. అయితే అమెరికాకు చెందిన ఇద్దరు మహిళలు ప్రేమకు హద్దులేవని అందరికి తెలియజెప్పేలా ఏకంగా చెట్లతో ప్రేమలో పడ్డారు. అంతవరకైతే పర్వాలేదు, కానీ చెట్లను పెళ్ళికూడా చేసుకోవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్పింక్లే, బెత్ స్టీఫెన్స్ చెట్లతో బాగా అనుబంధాన్ని పెంచుకున్నారు. చెట్లతో ప్రేమలో పడ్డామని 2004లో ఈ ఇద్దరు గ్రహించారు. 2008లో చెట్లను వివాహం చేసుకున్నారు. ఇన్నాళ్ళు ఈ విషయాన్ని దాచిపెట్టి ఉంచిన ఈ మహిళలు ప్రస్తుతం ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు.
ఇద్దరూ వారికి వారే.. ఎకో-సెక్సువల్‌గా తమను తాము ప్రకటించుకున్నారు. 300మంది సమక్షంలో తాము చెట్లను వివాహం చేసుకున్నట్లు ఈజంట చెబుతుంది. కాలిఫోర్నియాలోని శాంతా క్రజ్‌లో వివాహం జరిగిందని స్పష్టం చేశారు. స్ప్రింక్లే, బెత్ స్టీఫెన్స్ల లకు శాన్ ఫ్రాన్సిస్కోలోని రట్జర్స్ విశ్వవిద్యాలయంలో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే వారికి చెట్లపై ఉన్న ప్రేమను ఒకరితో ఒకరు పంచుకున్నారు. చెట్లను ఎక్కువగా ప్రేమిస్తున్నామని గ్రహించినవారు చెట్లను వివాహం చేసుకున్నారు.
చెట్లతోపాటు పర్వతాలు, కొండలను కూడా వీరు అమితంగా ఇష్టపడతారు. వారిద్దరు రాళ్లను కౌగిలించుకుంటారు. జలపాతాలను కూడా ప్రేమించే వీరు.. వీరు చెట్లను కౌగిలించుకోవడమే కాకుండా..ఈ ఇద్దరు చెట్ల ఆకులు, వేర్లతో రొమాన్స్ చేస్తారు. ఎల్ బిజిటి కమ్యూనిటీ కోసం ఈ ఇద్దరు పనిచేస్తున్నారు. తమ ప్రేమ కథ చెట్లను రక్షించడానికి ప్రపంచ పర్యావరణాన్ని కాపాడటానికేనని స్ప్రింక్లే, చెత్ స్టీఫెన్స్ చెబుతారు.