Oranges
Orange Powder : చూడటానికి మంచి రంగు,అంతకుమించిన రుచి.. ఎవరినైనా ఈ కమల పండ్లు ఇష్టపడేలా చేస్తాయి. ఇవన్నీ పక్కన బెడితే ఈ కమల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. నవంబరు నుండి జనవరి వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉండే కమలాపండ్లు ఎన్నో పోషకాలు ఉంటాయి. తీయటి కమలాపండ్లు గుజ్జులోనే కాదు తొక్కలో కూడా పోషకాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పండ్లగుజ్జులో 71 మి.గ్రా. విటమిన్-సి ఉంటే తొక్కలో మాత్రం 136 మి.గ్రా. విటమిన్-సి ఉంది. ఫైబర్ కూడా తొక్కలోనే ఎక్కువ.
కమలాపండ్ల తొక్కల్లోని పోషక విలువల విషయానికి వస్తే ఇందులో విటమిన్-సి, విటమిన్-ఎ, హెస్పరిడిన్, బీటా క్రిప్టోక్సాంధిన్లు, లైమోనిన్, ఫోలేట్, రైబోఫ్లేవిన్, థైమిన్, బి-6, కాల్షియం మొదలైనవి ఉన్నాయి. ముఖ్యంగా కమలా పండ్ల తొక్కలతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. కమలాపండ్ల తొక్కల్లో ఉన్న హెస్పరిడిస్ అనే ప్లావనాఇడ్ అధిక రకతపోటును నియంత్రించడానికి తోడ్పడుతుంది.
తొక్కల్లో ఉండే లైమోనిన్ అనే నూనె చర్మకాన్సర్‌ను తగ్గించగలదు. కమలాపండ్ల తొక్కల్లో ఉండే బీటా క్రిస్టోక్యాంధిన్లు ఊపిరితిత్తుల కాన్సర్ ముప్పును 37 శాతం తగ్గిస్తాయి. కమలాపండ్ల తొక్కల్లో ఉన్న పీచుపదార్ధం, పాలీశాకరైడ్లు జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధక సమస్యను అదుపుచేస్తాయి.
కమలా పండ్ల తొక్కల్లో ఉన్న విటమిన్-సి, విటమిన్-ఇ లు మొటమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అంతేకాక ఇందులోని ఫ్రీ రాడికల్స్ సూర్యకిరణాల నుండి చర్మాన్ని కాపాడి సన్‌స్క్రీన్‌లా పనిచేస్తాయి. కమలాపండ్ల తొక్కలు విటమిన్-సి మరియు-ఇ లను కలిగి ఉంటాయి. ఇవి జుట్టులోని చుండ్రు నివారణ, జుట్టురాలుట మొదలగు సమస్యలను నియంత్రిస్తాయి.
కమలాపండ్ల తొక్కలు దంతాలను తెల్లబరచడమేకాక చిగుళ్ళను బలపరుస్తాయి. నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. కమలాపండ్ల తొక్కలో ఉన్న విటమిన్-సి మరియు ఎ లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీనిలో ఉన్న యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ-ఇన్‌ప్లామేటరీ గుణాలు జలుబు, దగ్గులకు వ్యతిరేకంగా పోరాడతాయి. కమలాపండ్ల తొక్కల్లోని ఔషధగుణాలు క్యాన్సర్‌కు వ్యతిరేఖంగా పోరాడగలవు. తొక్కల్లో ఉండే ఫ్లావనాయిడ్లు శరీరంలో క్యాన్సర్ కణాల చలనాన్ని నిరోధిస్తుంది.
కమలాతొక్కల పొడి తయారీ విధానం :
కమలాపండ్లను తిన్న తరువాత తొక్కలను పారవేయకుండా తీసుకోవాలి. కమలాపండ్ల తొక్కలను గోరువెచ్చని నీళ్ళలో 5 నిమిషాలు ఉంచాలి. దీనివల్ల తొక్కలపై ఉన్న క్రిమిసంహార మందుల అవశేషాలు, దుమ్ము, ధూళి వంటివి తొలగిపోతాయి. ఆ తరువాత కమలాపండ్ల తొక్కలను పొడివస్త్రంతో తుడిచి నీడలో ఎండబెట్టాలి. ఎండ తీవ్రతను బట్టి 5-7 రోజుల్లో కమలాతొక్కలు ఎండిపోతాయి. తొక్క సులభంగా విరిగినట్లయితే వాటిని మిక్సీలో వేసి పొడిగా తయారుచేసుకోవాలి. శుభ్రమైన గాజుపాత్రలో నిల్వచేసినట్లయితే గది ఉష్ణోగ్రత వద్ద 4-5 నెలలు తేలికగా నిల్వచేయవచ్చు.
ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక చెంచా కమలాతొక్కల పొడికి ఒక చెంచా తేనె కలిపి గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని సేవించడం వల్ల సత్వర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఒక చెంచా కమలాతొక్కల పొడికి ఒక చెంచా తేనె. ఒక చెంచా పసుపు కలిపి చర్మానికి పూతగా పూయడం వల్ల చర్మ సమస్యలు అదుపులో ఉంటాయి. ఒక కప్పు కమలాతొక్కల పొడికి ఒక కప్పు పెరుగు కలిపి జుట్టుకు పట్టించి గంట తరువాత శుభ్రపరచడం వల్ల కేశాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు సమస్యలు నివారించబడతాయి.