Men Losing Reproduce : మగాళ్లు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నారు..!

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నారంట.. సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడ చూసినా కాలుష్యం.. కల్తీ ఆహారపదార్థాలతో తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.

Men are losing the ability to reproduce : పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నారంట.. సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడ చూసినా కాలుష్యం.. కల్తీ ఆహారపదార్థాలతో తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రతిఒక్కరి జీవన విధానంలో చాలావరకూ ప్లాస్టిక్ వినియోగం సర్వసాధారణమే. అయితే ఈ ప్లాస్టిక్, కాస్మటిక్స్, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి ఉత్పత్తులలో లభించే థాలెట్స్ అనే సాధారణ కెమికల్స్.. మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీని కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా కోల్పుతున్నారని హెచ్చరిస్తున్నారు. రీప్రొడెక్టీవ్ ఎపిడెమియాలజిస్ట్ సినాయి స్వాన్ ప్రకారం… ఈ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వల్ల మానవాళి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుందని, సంతానపరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొబోతున్నారంటూ హెచ్చరిస్తున్నారు.

గత కొన్ని దశాబ్దాలుగా సాధారణంగా మానువుల్లోని స్పెర్మ్ కౌంట్ వేగంగా పడిపోయిందని అధ్యయన పరిశోధక బృందం కనుగొంది. ఆ పరిశోధక బృందం స్వాన్ ఒకరు. థాలెట్స్ (phthalates), Bisphenol A అనే రసాయనాలు పునరుత్పత్తి ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో వివరించారు.

పిల్లల జీవసంబంధ అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయనేది మరింత అధ్యయనం చేయాల్సిందిగా చెబుతున్నారు. చిన్నపిల్లల మధ్య జీవసంబంధమైన తేడాలను కూడా ప్రభావితం చేస్తుందని గుర్తించారు. శారీరకంగానే కాదు.. మేధో వికాసం పరంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. ఆడవారిలో కంటే మగవారిలోనే సంతానోత్పత్తి పరంగా సామర్థ్యాన్ని వేగంగా కోల్పోతున్నారని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు