Mint Leaves : ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగించే పుదీనా ఫేస్ ప్యాక్స్

గుప్పెడు తాజా పుదీనా ఆకులను తీసుకోవాలి. దానికి కొద్దిగా నీరు, ఒక టేబుల్ స్పూన్ తేనెను చేర్చి మెత్తగా పేస్ట్ లా బ్లెండర్ లో వేసి తయారు చేసుకోవాలి.

Mint Leaves

Mint Leaves : శరీరంలో ముఖానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలా మంది ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటుంటారు. అయితే వివిధ రకాల కారణాల వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటివి వస్తుంటాయి. వీటి కారణంగా అందమైన ముఖం చూసేవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు వంటి వాటిని తొలగించుకునేందుకు అనేక హోం రెమిడీలను ఫాలో అవుతుంటారు. ఇలాంటి హోం రెమిడీలలో మంచి ఫలితాన్నిచ్చే హోమ్ రెమిడీగా పుదీనా చాలా చక్కగా ఉపకరిస్తుంది. దీనిని ఉపయోగించి అనేక రకాల ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకుని వినియోగించవచ్చు.

పుదీనా అనేది అద్భుతమైన సువాసన కలిగిన ఔషదగుణాలున్న మొక్కలలో ఒకటి. దీనిని ఆకుకూరగా వివిధ రకాల వంటకాల్లో వాడుతారు. అనేక కాస్మోటిక్ ఉత్పత్తుల్లో పుదీనాను ఉపయోగిస్తున్నారు. ఈ ఆకు రసాన్ని ఫేస్ క్రీములు, ఔషధాల తయారీలో వాడతారు. పుదీనాలో కార్మినేటివ్, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది. పుదీనాలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు చర్మంపై మొటిమలు , మచ్చలు తొలగించటంలో సహాయపడతాయి. తద్వారా చర్మం కాంతి వంతంగా మారుతుంది. ఇందులో ఉండే సలిసిలిక్ ఆమ్లం చర్మం లోపలి మలినాలను తొలగించటంలో దోహదం చేస్తుంది. పుదీనాను ఉపయోగించే వివిధ రకాల ఫేస్ ఫ్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం…

పుదీనా,తేనె ఫేస్ ఫ్యాక్ ; గుప్పెడు తాజా పుదీనా ఆకులను తీసుకోవాలి. దానికి కొద్దిగా నీరు, ఒక టేబుల్ స్పూన్ తేనెను చేర్చి మెత్తగా పేస్ట్ లా బ్లెండర్ లో వేసి తయారు చేసుకోవాలి. పెస్ట్ ను ముఖంపై మాస్క్ లా వేసుకోవాలి. అరగంట పాటు అలాగే ఉంచి తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ముఖం పై ఉన్న మొటిమలు తొలగిపోతాయి.

పుదీనా, పెరుగు ఫేస్ ప్యాక్ ; గుప్పెడు పొదీనా ఆకులను తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగును చేర్చి బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ గా చేసుకోవాలి. ఇలా తయారైన పేస్ట్ కు కొద్దిగా నీరు చేర్చి అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంటపాటు ఆరనిచ్చాక చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి 3సార్లు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పుదీనా, నిమ్మరసం ఫేస్ ప్యాక్ ; తాజా పుదీనా ఆకులను తీసుకోవాలి. వాటికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం చేర్చి బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ ను ముఖంతోపాటు, మెడబాగాల్లో అప్లై చేయాలి. అరగంట సమయం తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వల్ల ముఖం కాంతి వంతంగా మారటంతోపాటు, మెడపై ఉండే నలుపు తొలగిపోతుంది.

పుదీనా, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ ; కొన్ని తాజా పుదీనా ఆకులను తీసుకుని వాటికి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి బ్లెంటర్ లో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖంపై అప్లై చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచి తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి 3పర్యాయాలు ఇలా చేయటం వల్ల ముఖం అందంగా మారుతుంది.