Mix this powder in a glass of milk and drink it to avoid diseases like BP and sugar!
Avoid Diseases : ఇటీవలికాలంలో చాలా మందిని బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఏసమయంలో ఈ రోగాలు చుట్టుముడతాయో అర్ధంకాక సతమతమౌతున్నారు. జీవన విధానం, ఆరోగ్య అలవాట్లు ప్రధానంగా ఈ వ్యాధులు రావటానికి కారణమవుతున్నాయి. అయితే ఈ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో పల్లేరు కాయల పొడి కూడా ఒకటి. పల్లేరు కాయల్లో అనేక ఔషదగుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది.
బీపీ, షుగర్ వంటి అనారోగ్యాలను దరిచేరకుండా చేసుకోవాలంటే పల్లేరుకాయల పొడిని పాలల్లో కలుపుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొవ్వును కరిగించటంతోపాటు బరువును తగ్గించుకోవచ్చు. పల్లేరు కాయల పొడి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పాలను తాగడం వల్ల కంటి దోషాలు తొలగిపోయి కంటి చూపు మెరుగుపడుతుంది.
స్త్రీలు ఈ పాలను తాగడం వల్ల బహిష్టు దోషాలు, గర్భాశయ దోషాలు కూడా తొలగిపోతాయి. నోటి సమస్యలు, చిగుళ్ల మరియు దంతాల సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. వాత, పిత, కఫ దోషాలన్నీ తొలగిపోతాయి. పల్లేరు కాయలు మన శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా పల్లేరు కాయలతో పాలను తయారు చేసి తీసుకోవడం వల్ల కాలేయంలోని మలినాలు తొలగిపోయి కాలేయం శుభ్రపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు కూడా కరుగుతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
పల్లేరు పొడి పాలు తయారీ ;
ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను తీసుకుని వేడి చేయాలి. అనంతరం 4 పల్లేరు కాయలను పొడిగా చేసి ఆ పొడిని అందులో వేయాలి. తరువాత ఈ పాలను బాగా మరిగించాలి. పాలను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. రుచి కొసం పటిక బెల్లాన్ని లేదంటే తేనెను కలిపి తాగాలి. ఇలా తయారు చేసుకున్న పాలు వారానికి 4 సార్లు తాగాలి.