Protect Against Mosquito : వ్యాధులను వ్యాప్తి చేస్తున్న దోమలు ! దోమల బెడద నుండి రక్షించుకునేందుకు చిట్కాలు

వెల్లుల్లి వాసన కూడా దోమలకు నచ్చదు. సాంబ్రాణి పొగ వేసి నాలుగు వెల్లుల్లి ముక్కలు దంచి వేస్తే ఆ వాసనకు ఇంట్లోని దోమలు బయటికి పోతాయి. దోమలను నిరుత్సాహపరిచే అనేక గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. దీనిలో సల్ఫర్ అంటే దోమలకు అసలు పడదు.

Protect Against Mosquito : దోమ చిన్నదైనప్పటికీ, ఈ కీటకాలు భూమిపై ఉన్న ఇతర జంతువులు లేదా కీటకాల కంటే అనారోగ్యాన్ని వ్యాప్తి చేయగల సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి. దోమలు దాదాపు పదిహేనుకి పైగా రోగాలను వ్యాపింప చేస్తాయి. వాటిల్లో ప్రమాదకరమైనవి డెంగ్యూ, జికా వైరస్, ఎల్లో ఫీవర్, చికెన్ గున్యా, బోదకాలు, మలేరియా, వెస్ట్ నైల్ ఫీవర్ ఇవన్నీ కూడా దోమలు వల్ల మాత్రమే వ్యాప్తి చెందుతాయి.

మన శరీరం నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ దోమలను ఆకర్షిస్తుంది. అందులోనూ ఆడదోమలు పిల్లల్ని కనాలంటే మన రక్తం అవసరం. రక్తంలోని ఎమైలో ఆమ్లాలు ఉంటేనే ఆ దోమ గుడ్లు పరిపక్వం అవుతాయి. మనుషులను కుట్టేది ఆడదోమలే. ఒకరినుండి మరొకరికి రోగాలను అంటిచేస్తాయి. అందుకే ఇంతలా రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. అవి ఒక్కసారి మగ దోమ నుంచి శుక్ర కణాలను పొంది దానితోనే దాదాపు 15 సార్లు గుడ్లు పెట్టగలదు. ఒక్కో దోమ 30 రోజులు జీవిస్తుంది. ముఖ్యంగా మన ఇంట్లో పసి పిల్లలు, చిన్నారులు ఉంటే మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వారిని దోమల నుంచి రక్షించడానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మంచిది.

దోమల బెడద నుండి రక్షించుకునేందుకు ;

1. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే కర్పూరాన్ని వెలిగించి తలుపులు మూసి వేయాలి. దాని వాసన ఇల్లంతా వ్యాప్తి చెందాక తలుపులు తెరవాలి. అరగంటలో ఇంటి నుండి దోమలన్నీ బయటకు వెళ్లిపోతాయి.

2. బంతిపూల మొక్కలంటే దోమలకు పడవు. బంతి పూల మొక్కలు ఇంటి ముందు వేసుకుంటే దోమలు రావు. తులసి మొక్కల్ని కూడా అధికంగా పెంచితే దోమల బాధ పోతుంది. రోజ్ మేరీ మొక్కలు కూడా కొన్ని ఇంటి గుమ్మం ముందు పెడితే దోమలు రావు

3. వెల్లుల్లి వాసన కూడా దోమలకు నచ్చదు. సాంబ్రాణి పొగ వేసి నాలుగు వెల్లుల్లి ముక్కలు దంచి వేస్తే ఆ వాసనకు ఇంట్లోని దోమలు బయటికి పోతాయి. దోమలను నిరుత్సాహపరిచే అనేక గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. దీనిలో సల్ఫర్ అంటే దోమలకు అసలు పడదు. వెల్లుల్లి రెబ్బలను ఉడకబెట్టి, ద్రావణంతో స్ప్రే బాటిల్‌ను నింపి ఇంట్లో స్ప్రే చేయాలి.

4. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు బెడద తగ్గుతుంది. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి . నీరు ఉన్న చోటే దోమలు నివాసం ఉంటాయి.

5. చామంతి పూలను ఎండబెట్టి వాటికి కొంచెం పేడ కలిపి చిన్న చిన్న బిళ్లలుగా చేసి ఎండ పెట్టాలి. బాగా ఎండిన ఈ బిళ్లలను రాత్రి పూట వెలిగిస్తే ఆ వాసనకు దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

6. నిమ్మకాయను సగానికి కోసం దానిలో లవంగాలను గుచ్చాలి. వాటిని పగటి పూట గదిలో ఉంచితే డెంగీని వ్యాప్తి చేసే దోమలు ఆ ప్రాంతంలోకి రావు.

7. ఇంటిలోని నీటితొట్టి, కుళాయిల దగ్గర, మురికి కాలువల దగ్గర 100లీటర్ల నీటిలో 25గ్రాముల పసుపు పొడి కలిపి చల్లితే దోమల బెడద ఉండదని నిపుణులు చెబుతున్నారు.

8. నీరు నిల్వ ఉన్న గుంతల్లో, స్టోరేజ్ ట్యాంకుల్లో 100గ్రాముల వేపగింజల పిడిని చల్లితే దోమలు గుడ్లు పెట్టవు. కిరోసిన్ లో వేప నూనె పోసి ఇంట్లో దీపం వెలిగించినా దోమలు వ్యాపించకుండా ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు