Ambani 3 Private Jets : ముఖేశ్ అంబానీ 3 లగ్జరీ ప్రైవేట్ జెట్స్ ఇవే.. ఎగిరే విమానాల్లో విలాసవంతమైన వసతులు..!

ముఖేశ్ అంబానీ ఆంటిలియా భవనం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాల్లో ఇదొకటి. అంబానీ ఫ్యామిలీ లైఫ్ స్టయిల్ ఎంత లగ్జరీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. అంబానీల కోసం భూలోక స్వర్గాన్ని నిర్మించినట్టుగా ఉంటాయి.

Inside Mukesh Ambani’s 3 private jets : ముఖేశ్ అంబానీ ఆంటిలియా భవనం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాల్లో ఇదొకటి. అంబానీ ఫ్యామిలీ లైఫ్ స్టయిల్ ఎంత లగ్జరీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. అంబానీల కోసం భూలోక స్వర్గాన్ని నిర్మించినట్టుగా ఉంటాయి. అలాగే అంబానీల కోసం ప్రైవేట్ జెట్లలో విలాసవంతమైన గదులను నిర్మించారు. వీటినే బహుషా.. ఎగిరే గృహాలు అంటారేమో.. పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసుకు ఒక ప్రైవేట్ బెడ్ రూమ్ సూట్ నిర్మించారు. అత్యంత ఖరీదైన ఈ జెట్ విమానంలో అనేక ఫీచర్లు ఉన్నాయి. ముఖేష్ అంబానీకి సొంత మూడు అల్ట్రా లగ్జరీ ప్రైవేట్ జెట్‌ విమానాల్లో ఎలాంటి వసతులు ఉన్నాయో ఓసారి చూద్దాం..

1. Boeing Business Jet :
బోయింగ్ బిజినెస్ జెట్ యజమానిగా ముఖేశ్ అంబానీకి ఎంతో క్రేజ్ ఉంది. ఈ విమానంలో ఎగిరే హోటల్ అత్యంత విలావసవంతంగా ఉంటుంది. 1,004 చదరపు అడుగులు ఉండే ఈ హోటల్ లో ప్రైవేట్ బెడ్ రూం సూట్, ఎగ్జిక్యూటీవ్ ఆఫీసు కూడా ఉంది. బోయింగ్ బిజినెస్ జెట్ కాస్ట్ దాదాపు రూ.535 కోట్లు (73 మిలియన్ డాలర్లు) వరకు ఉంటుంది. ఈ ఒక్క ప్రైవెట్ జెట్ మాత్రమే కాదు.. మరో రెండు కూడా ఉన్నాయి.

2. Falcon 900EX Jet :
బోయిన్ బిజినెస్ జెట్ విమానంతో పోలిస్తే.. ఈ జెట్ (Falcon 900EX Jet) చాలా చిన్నదిగా ఉంటుంది. అంబారీ ఏరియల్ ప్లీట్ కోసం వీలుగా దీన్ని రూపొందించారు. లాంగ్ రేంజ్ జెట్ కూడా.. ఇందులో మూడు కేబిన్ జోన్లు ఉంటాయి. 4,500nm రేంజ్ వరకు దూసుకెళ్ల గలదు. ఈ లాంగ్ రేంజ్ జెట్ విమానంలో 12 మంది వరకు సౌకర్యవంతంగా ఉండొచ్చు. కానీ, దీని సీటింగ్ విధానం 16 మంది ప్రయాణికుల వరకు విస్తరించవచ్చు.

3. Airbus A319 :
అంబానీ జెట్ విమానాలలో మూడోది.. అదే.. Airbus A319.. అంబానీ Airbus A320 ఫ్యామిలీలో ఇదొకటి.. ప్రపంచవ్యాప్తంగా టాప్ ఏవియేషన్ కంపెనీలు వాణిజ్య ప్రయాణికుల కోసం ఈ తరహా జెట్ ఎయిర్ లైనర్లను విస్తృతంగా వాడుతుంటాయి. ముఖేశ్ అంబానీ తన సతీమణి నీతా అంబానీకి తన 44వ పుట్టినరోజు సందర్భంగా ఈ అద్భుతమైన జెట్ విమానాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. అంబానీ Airbus A319లో కస్టమ్ ఫిట్టెడ్ ఆఫీసు కూడా ఉందట.. అలాగే ఒక క్యాబిన్ కూడా ఉందట.. ఇందులో గేమ్స్, మ్యూజిక్ సిస్టమ్స్, శాటిలైట్ టెలివిజన్, వైర్ లెస్ కమ్యూనికేషన్స్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు