Mutations Covid Vaccines
Covid vaccines : కరోనా కొత్త మ్యుటేషన్లతో ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది. మొదటి కరోనావైరస్ ఆధారంగా తయారుచేసిన ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు ఏడాదిలోపే పనికిరాకుండా పోవచ్చునని ఎపిడెమియాలజిస్ట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే.. మ్యుటేషన్ వైరస్‌లపై కరోనా వ్యాక్సిన్లు ప్రభావంతంగా పనిచేయకపోవచ్చునని అంటున్నారు. పీపుల్స్ వ్యాక్సిన్ అలియన్స్ నిర్వహించిన సర్వేలో మ్యుటేషన్లపై కరోనా వ్యాక్సిన్లు ప్రభావాన్ని కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచంలో 28 దేశాలల్లోని వివిధ ఎకాడమిక్ ఇన్సిస్ట్యూట్స్ కు చెందిన 77మంది నిపుణులతో ఈ సర్వేను నిర్వహించారు.
దాదాపు మూడవ వంతు 9 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితిని వ్యాక్సిన్లు పరిమితమయ్యాయని తేలింది. మ్యుటేషన్లపై ప్రస్తుత టీకాలు పనిచేయమని నమ్మేవారిలో 8లో ఒకరి కంటే తక్కువ మంది స్పష్టం చేశారు. మూడింట రెండు వంతుల మంది వైరస్ మ్యుటేషన్ చెందడానికి ఒక ఏడాది లేదా అంతకన్నా తక్కువ సమయం పడుతుందని భావించారు. ఈ కొత్త మ్యుటేషన్లపై మొదటి కరోనా వ్యాక్సిన్లలో ఎక్కువ భాగం పనికిరానివని తేల్చేశారు. మ్యుటేషన్లపై పనిచేయాలంటే ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లను మరింత సమర్థవంతంగా తయారుచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిపుణుల్లో 88శాతం మంది అనేక దేశాలలో తక్కువ వ్యాక్సినేషన్ కారణంగా మ్యుటేషన్లు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రస్తుత ప్రపంచ వ్యాక్సినేషన్ రేటు ప్రకారం.. పేద దేశాలలో మెజారిటీ ప్రజలలో కేవలం 10శాతం మందికి మాత్రమే వచ్చే సంవత్సరంలో టీకాలు వేసే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. వాస్తవానికి చాలావరకు కోవిడ్ వ్యాక్సిన్లను గత ఏడాదిలో పరీక్షించిన తర్వాత అత్యవసర వినియోగం కోసం మాత్రమే అనుమతిచ్చారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నాయి. అందులో మోడెర్నా, ఫైజర్, బయోంటెక్, ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్లు.. అమెరికా, యూకే, ఈయూలో మాత్రమే ఈ వ్యాక్సిన్లను తయారచేస్తున్నారు. ఇక చైనా, రష్యాలో మాత్రం తమ సొంత వ్యాక్సిన్లను తయారుచేసుకున్నాయి.
కరోనా మమహ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 127 మిలియన్ల మంది కరోనా బారిపడగా.. 2.7 మిలియన్ల మంది మరణించారు. అమెరికా, బ్రెజిల్, ఇండియా, ఫ్రాన్స్, రష్యా, యూకే దేశాల్లోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇతర మోడెర్నా, ఫైజర్ షాట్ల కంటే యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకా మాత్రమే గేమ్ ఛేంజర్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇమ్యూనైజేషన్ అందించడంతో పాటు అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ సులభంగా స్టోర్ చేయొచ్చు.. అలాగే ఎక్కడైనా తరలించవచ్చు. అయినప్పటికీ కరోనా వ్యాక్సిన్లపై ప్రజల్లో నమ్మకం, అవగాహన లేదు. క్లినికల్ డేటా.. వ్యాక్సిన్లు సురక్షితమని ప్రకటించినప్పటికీ కూడా టీకాలు వేయించుకునేందుకు ముందుకు రావడంలేదు. భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది.