Neem Tree : నోటి బ్యాక్టీరియాను తగ్గించి, చిగుళ్ల సమస్యలను నివారించే వేప!

అల్సర్లు, గ్యాస్, కంటి రుగ్మతలు, కడుపునొప్పి, ఆకలి లేకపోవటం, చర్మ వ్యాధులు, గుండె, రక్త నాళాల వ్యాధులను తొలగించటంలో వేప సహాయపడుతుంది.

Neem Tree : ప్రాచీన గృహ వైద్యంలో వేపను ఎన్నో తరాల నుండి వినియోగిస్తూ ఉన్నారు. వేపలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటమే కాక అనేక ఔషదగుణాలు ఉన్నాయి. వేపచెట్టులో ప్రతి భాగం ఎంతో విలువైనదిగా ఆయుర్వేద నిపుణులు చెబుతారు. బెరడు, పువ్వులు, ఆకులు, గింజలు, కలప, నూనె, పిట్లు ఇలా వేప సంపూర్ణంగా మన ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. అనేగ రుగ్మతలను తొలగించేందుకు వేప ఉపయోగపడుతుంది.

అల్సర్లు, గ్యాస్, కంటి రుగ్మతలు, కడుపునొప్పి, ఆకలి లేకపోవటం, చర్మ వ్యాధులు, గుండె, రక్త నాళాల వ్యాధులను తొలగించటంలో వేప సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు సర్వరోగ నివారణిలా పనిచేస్తుంది. వేప యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చిగురువాపును నివారించడానికి బాగా ఉపకరిస్తుంది. తీవ్రమైన చిగుళ్ల వ్యాధితో కారణంగా వచ్చే రక్తస్రావం నీ తగ్గిస్తుంది. నోటిలోని బ్యాక్టీరియా తగ్గించి దుర్వాసనను తొలగించడానికి వేప సహాయపడుతుంది.

ఉదయం పళ్ళు, చిగుళ్ళు శుభ్రం చేయడానికి వేప పుల్లలు ఉపయోగించటం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవు. లేత వేప కొమ్మల తో పళ్లు తోమడం ఒక అలవాటుగా మార్చుకున్న వారికి నోటి దుర్వాసన, డయేరియా, చిగుళ్ల నుంచి రక్తం కారడం పూర్తిగా తగ్గుతుంది. లేత వేపాకు చిగుర్లు నిత్యం కొంత తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి నియంత్రించవచ్చు. లేత వేపాకులు గ్లాసు నీటిలో అరగంట పాటు నానబెట్టి తర్వాత అరగంట పాటు మరగబెట్టాలి. చల్లారాక వడగట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి సేవిస్తే కాలేయానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

వేప గింజల రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే పచ్చ కామెర్ల వ్యాధి నయం అవుతుంది. వేప పువ్వు పొడి, కొంచెం తేనె లేక బెల్లం తో కలిపి తీసుకుంటే బలహీనత తగ్గుతుంది. చర్మంపై పొంగు వ్యాధి వల్ల ఏర్పడే మచ్చలను, వేప చిగుళ్లను నూరి మర్దనా చేసి మచ్చలు పోతాయి. వేప చిగురు రోజూ తినడం అలవాటు గా మార్చుకున్న వారికి దగ్గు, అజీర్ణం, కడుపులో పురుగుల బెడద ఉండవు. అయితే వేపను కొద్ది మోతాదులో మాత్రమే వాడాలి. అతిగా వేపను తీసుకోవటం వల్ల కొన్ని రకాల దుష్ర్పభావాలు చూపే అకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు