Covishield Doses Gap : కోవిషీల్డ్ విరామంపై ఆందోళన అనవసరం : కేంద్రం క్లారిటీ

కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ విరామ కాలంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కోవిషీల్డ్ విరామ కాలంలో ఎలాంటి తక్షణ మార్పులు లేవని పేర్కొంది. బ్యాలన్స్ చేయాలన్నది మాత్రమే ఉద్దేశమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.

Covishield Doses Gap : కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ విరామ కాలంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కోవిషీల్డ్ విరామ కాలంలో ఎలాంటి తక్షణ మార్పులు లేవని పేర్కొంది. బ్యాలన్స్ చేయాలన్నది మాత్రమే ఉద్దేశమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ విరామ కాలాన్ని తగ్గించారంటూ వచ్చిన వార్తలపై ఆందోళన అనవసరమని పేర్కొంది. ఈ విరామాన్ని శాస్త్రీయ అధ్యయనం ప్రకారమే తగ్గించడం జరిగిందని తెలిపింది.

ఇప్పటికే దీనిపై శాస్త్రీయ ఆధారాలను సేకరించడం జరిగిందని, త్వరలో జరగబోయే నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూపు సమావేశంలో దీనిపై నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కోవిషీల్డ్ విరామంపై ప్రజలు ఆందోళన గురికావొద్దని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డా.వీ.కె.పాల్ సూచించారు. ఒక్కోసారి రెండు డోసుల మధ్య విరామ కాలాన్ని బ్యాల్సన్స్ చేయాల్సి ఉంటుందని అన్నారు.

గ్యాప్ పెంచడం ద్వారా మొదటి డోసు తీసుకున్నవారికి వైరస్ వల్ల కలిగే ముప్పుపై కూడా అధ్యయనం జరిగిందన్నారు. వారిలో రోగనిరోధత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని కొంతమంది పరిశోధకులు ఇలానే అభిప్రాయపడ్డారని పాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 12-16 వారాల (84 రోజులు) మధ్య విరామంతో రెండు డోసులను అందించడం జరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు