Labourer Lakhs YouTube : ఇతడో రోజువారీ కూలీ.. యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదిస్తున్నాడు!

అతడో రోజువారీ కూలీ (Daily Wage Worker).. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. రోజువారీ కూలీగా పనిలోకి వెళ్తే తప్పా ఇళ్లు గడవని పరిస్థితి అతడిది.. కానీ, ఇప్పుడు ఒక పాపులర్ యూట్యూబర్ గా అవతరించాడు.

Odisha Labourer Earns Lakhs From YouTube : అతడో రోజువారీ కూలీ (Daily Wage Worker).. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. రోజువారీ కూలీగా పనిలోకి వెళ్తే తప్పా ఇళ్లు గడవని పరిస్థితి అతడిది.. కానీ, ఇప్పుడు ఒక పాపులర్ యూట్యూబర్ గా అవతరించాడు. అతడే.. Isak Munda.. ఒడిషాలోని సంబాల్ పూర్ జిల్లాకు చెందిన వ్యక్తి లక్షల సంపాదన ఆర్జిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత ఏడాది నుంచే యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు. మార్చి 2020లో కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకుండాపోయింది. అలాంటి పరిస్థితుల్లో యూట్యూబ్ వీడియోలు చేయాలనే ఆలోచన వచ్చింది. అలా మొదలైంది అతడి జెర్నీ.. ఇప్పుడు అతడు లక్షల్లో సంపాదిస్తున్నాడు.

యూట్యూబ్ వీడియోలో వ్యూయర్లను ఆకట్టుకునేందుకు తనకు బాగా నచ్చిన పని ఎంచుకున్నాడు. ఒకప్పుడు ఆకలిని తీర్చుకోవడమే ఎంతో కష్టపడేవాడు.. ఒక పూట అన్నం కోసం ఎన్నో ఇబ్బందులు పడేవాడు.. ఇదే అన్నం కోసం తానెంతో రోజుంతా కష్టపడేవాడినని, తాను పడిన బాధలను చెప్పుకుంటూ వీడియోలో భోజనాన్ని ఆరంగించేవాడు. ఉడికించిన అన్నం, కర్రీని తింటూ వీడియోలు చేస్తున్నాడు.  35ఏళ్ల ముండా చేసిన వీడియోలకు ఇప్పటివరకూ 50వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒక ప్లేటులో అన్నం, సాంబారు, టమాటో, పచ్చి మిరపకాయలను ఉంచుకుని వేగంగా తినేయడం ఇతగాడి స్టయిల్.. అదే అతడిని పాపులర్ చేసింది.

యూట్యూబ్ ప్రారంభించినప్పుడు.. వీడియోల కోసం మూడు వేలు లోను తీసుకుని ఒక చిన్న స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ఆ ఫోన్ తోనే తన గ్రామంలో వీడియోలు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. తామంతా ఎలా తింటారో వీడియోలో చూపించాడు. తన వీడియోలకు అధిక రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు. ఇప్పటివరకూ అతడి యూట్యూబ్ ఛానెల్ కు 7 లక్షల యూట్యూబ్ సబ్ స్ర్కైబర్లు వచ్చారు. ఆగస్టు 2020లో యూట్యూబ్ నుంచి రూ.5 లక్షలు అందుకున్నాడు. అదే డబ్బుతో ఒక ఇల్లు కూడా కట్టుకోనేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. అలాగే ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి కూడా తనకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తానని అంటున్నాడు.

ట్రెండింగ్ వార్తలు