Smoking Day
No Smoking Day: ప్రతి సంవత్సరం మార్చి రెండో బుధవారాన్ని నో స్మోకింగ్ డేగా చెప్పుకుంటారు. నికోటిన్ కు బానిస అయిన స్నేహితులు, కుటుంబ సభ్యులను దాని నుంచి విముక్తి కలిగించేందుకు ఈ రోజును ప్లాన్ చేశారు. వారు మాత్రమే కాకుండా ఇతరులు కూడా స్మోకింగ్ మానేయడానికి నో స్మోకింగ్ డేను వినియోగించాలి.
సిగరెట్ తాగే వారిని మాత్రమే కాదు చుట్టూ ఉన్న వారిని కూడా బాధపెడుతుంది. నో స్మోకింగ్ డే ప్రత్యేకత, చరిత్ర గురించి తెలుసుకుందాం..
నో స్మోకింగ్ డే చరిత్ర
యూకే దేశస్థులు పొగ తాగడానికి బాగా అలవాటుపడిపోయి ఉన్నారు. అప్పుడే 1984లో నో స్మోకింగ్ డేను తీసుకొచ్చారు. ముందుగా దీనిని మార్చి తొలి బుధవారం జరుపుకునేవారు.. యాష్ వెడ్‌నెస్ డే పేరుతో జరుపుకునేవారు. క్రమేపీ దానిని రెండో బుధవారానికి మార్చారు. ఇప్పుడు యూకేతో పాటు అన్ని దేశాల్లోనూ జరుపుకుంటున్నారు.
నో స్మోకింగ్ డే ముఖ్య ఉద్దేశ్యం
మార్చి 2022న జరుపుకునే నో స్మోకింగ్ డే ప్రధాన ఉద్దేశ్యం.. ‘పొగ తాగడం మానేసినంత మాత్రాన ఒత్తిడి పెరుగుతుందని కాదు’. ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశ్యం స్మోకింగ్ మానేయాలని అనుకునేవారికి పొగమానినంత మాత్రాన ఒత్తిడి పెరుగుతుందని కాదని తెలియజేయడమే.
Read Also: ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే హిస్టరీ తెలుసా
నో స్మోకింగ్ డే ప్రత్యేకత
పొగతాగడం దుష్ప్రభావాల గురించి తెలియజేయడానికి ఈ రోజు జరుపుకుంటారు. అవగాహన పెంచి వారిని మాన్పించాలి. మానాలనుకునేవారిని ప్రోత్సహించి వారికి సహకరించాలి. ఈ రోజున, ప్రజలు తమ ప్రాణాలకు ముప్పు కలిగించే అలవాటును విడిచిపెట్టడంలో తమ వంతుగా ముందుకురావాలని ఆశిస్తున్నారు.