Increase Appetite :
Increase Appetite : కొంతమందికి ఎంత మంచి వంటలు చేసిపెట్టినా తినాలనిపించదు. ఎప్పుడూ నీరసంగానే ఉంటారు. బాగా అలసిపోతారు కూడా. దీనికి తోడు ఇలా తినకుండా ఉండేవారు తొందరగా బరువు తగ్గుతుంటారు. ఇలాంటి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. నిజానికి ఇలా ఆకలి లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఆకలి సమస్యకు ఇంట్లో లభించే కొన్ని పదార్ధాలతోనే పరిష్కారం లభిస్తుంది. అయితే అలాంటి పదార్ధాల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. ఆకలి పెంచేందుకు దోహదం చేసే పదార్ధాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ద్రాక్ష ; ద్రాక్షలో విటమిన్ సి ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా ఉండటానికి సహాయపడుతుంది. భోజనం చేశాక కొన్ని ద్రాక్ష పండ్లను తీసుకోవటం వల్ల అరుగుదల పెరుగుతుంది. అంతేకాకుండా ఆకలి బాగా పుడుతుంది.
ఖర్జూరాలు ; ఆకలి లేని వారు ఖర్జూరాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు నాలుగైదు ఖర్జూరాలు తింటే ఆకలి సమస్య తొలగిపోతుంది. వివిధ రూపాల్లో ఖర్జూలను తీనవచ్చు.
నిమ్మరసం ; జీర్ణక్రియకు నిమ్మరసం చాలా మంచిది. శరీరంలోని హానికారక వ్యర్ధాలను బయటకు పంపుతుంది. ఆకలి మందగించినవారు గ్లాసు నీళ్లలో కొంచెం నిమ్మరసం పిండి అందులో కొద్దిగా తేనె, ఉప్పు కలిపి తీసుకుంటే ఆకలి బాగా పెరుగుతుంది.
అల్లం ; అజీర్తి, వికారం వంటి సమస్యలను తొలగించటంలో అల్లం బాగా ఉపకరిస్తుంది. ప్రతిరోజు సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కల్ని నమిలి ఆ రసాన్ని నెమ్మదిగా మింగుతుండాలి. ఇలా చేయటం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్ధ పనితీరులో మార్పు మొదలవుతుంది.
మెంతిపొడి ; మెంతిపొడి పొట్టలో గ్యాస్ ను బయటకు పంపటంలో తోడ్పడుతుంది. తద్వారా ఆకలి పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం మెంతిపొడిని తేనె తో కలిపి తీసుకోవటం మంచిది. పెరుగులో కలుపుకుని కూడా తినవచ్చు.
దాల్చిన చెక్క ; దాల్చిన చెక్కను పొడిగా చేసుకుని అందులో కొద్దిగా చక్కెర, కొంచెం తేనె కలుపుకోవాలి. ఇలా తరుచుగా తీసుకోవటం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.