Cashews
Cashews : పోషకాలు పుష్కలంగా ఉండే జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. జీడిపప్పులో ఐరన్, జింక్, విటమిన్ సి, బి,ఇ,కె,బి6,బి9,బి3,బి2,బి1,మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులతోపాటు అనేక ప్రొటీన్లు ఉంటాయి. జీడిపప్పు తినడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. జీడిపప్పులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి. కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గడానికి డైట్‌లో చేర్చుకుంటే ఫలితం కనిపిస్తుంది. దీనిలో అన్‌శాటురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ హృద్రోగాల ముప్పును నివారిస్తాయి.
ఉడికించిన మాంసంలో ఉండే ప్రొటిన్‌కు సమానంగా జీడిపప్పులోనూ ప్రొటిన్ ఉంటుంది. ఇందులోని కాపర్ బుద్ధి కుశలతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం, మాంగనీస్ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వేయించుకుని లేదంటే, గ్రైండ్ చేసుకుని తింటే జీడిపప్పు సులభంగా జీర్ణమవుతుంది. మధుమేహ రోగులు, టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు జీడిపప్పు తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. జీడిపప్పును తినటం వల్ల రోగనిరోధక వ్యవస్ధ బలపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె పనితీరును పెంచటానికి అవసరమైన పోషకాలు జీడిపప్పులో లభిస్తాయి.
జీడిపప్పు నూనెలో ఉండే కాపర్ , చర్మం, జుట్టు రంగును కాపాడటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే లినోలిక్, ఒలీక్ యాసిడ్లు జట్టు మృదువుగా ఉండాలే చేస్తాయి. జీడిపప్పు రోజుకు తగిన మోతాదులో తీసుకుంటే శులభంగా బరువు కోల్పోతారు. కండరాల నొప్పులతోపాటు, ఒత్తిడిని తగ్గించటంలో సహాయపడతాయి. జీడిపప్పులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్త హీనత సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్ధాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్ధాయిని పెంచటంలో ఇవి సహాయపడతాయి. ఎల్ డి ఎల్ చెడు కొలెస్ట్రాల్ స్ధాయిలు తగ్గటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.