Pulses : పోషకాలనందించే పప్పు దినుసులు

కందిపప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. తక్కువ ధరకు లభిస్తుంది కాబట్టి సామాన్యులు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కందిపప్పు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

Eating Pulses Benefits

Pulses : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన పోషకాలు కచ్చితంగా అవసరం. ముఖ్యంగా మాంసాహారం తీసుకోనివారికి ప్రొటీన్లు అందించే ప్రధాన ఆహారం ఈ పప్పులే. వీటి నుంచి ప్రొటీన్లు మాత్రమే కాదు.. ఇతర పోషకాలు ఎన్నో అందుతాయి. గుండె వ్యాధులు, క్యాన్సర్లతో పాటు టైప్‌-2 డయాబెటిస్‌ వంటివీ అదుపులో ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు, ఖనిజాలు, మినరల్స్ సమృద్దిగా ఉండాలి. ఇవన్నీ కూరగాయల ద్వారా ఎక్కువగా లభిస్తాయి. వీటి తర్వాత పప్పులలో మాత్రమే ఇది దొరుకుతాయి. అందుకే ప్రతి రోజు ఏదో ఒక పప్పు కర్రీ ఆహారంలో ఉండేవిధంగా చూసుకోవాలి.

కందిపప్పు : కందిపప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. తక్కువ ధరకు లభిస్తుంది కాబట్టి సామాన్యులు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కందిపప్పు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీనిలో అధిక మోతాదులో లభించే ఫోలిక్‌ యాసిడ్‌ మహిళలకు అవసరమైన కీలక విటమిన్‌. ముఖ్యంగా గర్భిణుల్లో పిండం ఎదుగుదలకు ఇది ఎంతో ముఖ్యం. కందిపప్పుని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్లు, మేలు చేసే కొవ్వులు, కార్బోహైడ్రేట్‌లు అందుతాయి. తక్షణ శక్తిని అందిస్తాయి. వీటితో పాటు క్యాల్షియం, పొటాషియం, విటమిన్‌ బి వంటివీ పుష్కలంగా లభిస్తాయి. కందిపప్పు తింటే కొన్ని రకాల గుండె వ్యాధులు, క్యాన్సర్లతో పాటు టైప్‌-2 డయాబెటిస్‌ వంటివీ అదుపులో ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ప్రోటీన్, బి విటమిన్ల గొప్ప వనరులలో ఒకటిగా చెప్పవచ్చు. తక్కువ కొవ్వు, కేలరీలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కందిపప్పుని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియను మెరుగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకలను బలంగా చేస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

పెసరపప్పు : కందిపప్పు తర్వాత ఎక్కువగా ఉపయోగించేది పెసరపప్పు. దీనిని కిచిడీ తయారీకి ఎక్కువగా వినియోగిస్తారు. ఈ పప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన పిండి పదార్థాలకు గొప్ప మూలంగా చెప్పవచ్చు. ఇందులో ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు, గుండె జబ్బులున్నవారికి ఈ పప్పు చాలా మంచిది. 100 గ్రాముల పప్పులో 22 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. దీనిలో ఎక్కువ ఫైబర్‌, తక్కువ మొత్తంలో కెలోరీలు లభిస్తాయి. దీంట్లోని ఐరన్‌, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలూ తగినంతగా లభిస్తాయి. అందుకే పెసరపప్పుని తరచుగా తింటుంటే… ఎముకలు బలంగా ఉంటాయి. వేసవిలో తినడం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది.

శనగపప్పు : ప్రొటీన్, పీచుతో కూడిన శనగపప్పు మీ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా సహాయపడుతుంది. ఒక కప్పు శనగపప్పులో తగినంత ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియం ఉంటుంది. శనగపప్పు గుండె రోగులకు, మధుమేహా వ్యాధి గ్రస్థులకు మేలు చేస్తుంది. ఇది మీ రక్తపోటును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది. అర కప్పు చనా పప్పు మీకు 9 గ్రాముల వరకు ప్రొటీన్‌ని అందిస్తుంది. శాకాహారం తీసుకునేవారు సెనగపప్పును తరచుగా వంటల్లో వాడటం వల్ల దీని నుంచి తగిన మోతాదులో ప్రొటీన్లు అందుతాయి. కాపర్‌, మాంగనీస్‌ ఖనిజాలు ఎక్కువే. మధుమేహమూ అదుపులో ఉంటుంది.

మసూర్ పప్పు : ఎర్ర కాయధాన్యాలు లేదా మసూర్ పప్పును ప్రధానంగా అనేక ఉత్తర భారత రాష్ట్రాల్లో తింటారు. ఈ పప్పులో ఐరన్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, బి6, బి2, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అర కప్పు మసూర్ పప్పు మీకు 9 గ్రాముల ప్రొటీన్‌ను అందిస్తుంది.

మినపపప్పు : పప్పుధాన్యాల్లో ప్రొటీన్‌, ఇనుము ఎక్కువగా లభించే రకం ఇది. ఈ పప్పులోని పోషకాలకు శరీరంలో శక్తి స్థాయుల్ని పెంచి, చురుగ్గా ఉండేలా చేసే శక్తి ఎక్కువ. ముఖ్యంగా నెలసరి వయసులో ఉన్నవారి శరీరంలో ఇనుము లోపించకుండా ఉండాలంటే ఈ పప్పుకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అలానే మాంసాహారం తిననివారు దీన్ని తీసుకోవడం వల్ల తగినంతగా ప్రొటీన్‌ శరీరానికి అందుతుంది. అధికంగా తీసుకోవాలి. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలూ అధికమే.