Nuts For Hormonal Imbalance
Hormonal Imbalance : బరువు నిర్వహణ సమస్యలు, సక్రమంగా లేని ఋతు చక్రం, చర్మ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు, ఇన్సులిన్ నిరోధకత, వంధ్యత్వానికి దారితీసే హార్మోన్ల అసమతుల్యత ,పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) అనేది ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిసిఓఎస్ తో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దురదృష్టవశాత్తు దీనికి నివారణకు ఎలాంటి చికిత్సలు లేవు. కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-3, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు మరియు మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలలో పుష్కలంగా ఉన్నాయి. ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా హార్మోన్ల అసమతుల్యత, అలాగే బరువు పెరగకుండా చూడవచ్చు.
హార్మోన్ల అసమతల్యతకు గింజలు :
నువ్వులు ; నువ్వుల గింజలలో కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు విటమిన్ ఇ ఉన్నాయి, ఇవి మహిళల్లో ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఉబ్బరం, మానసిక కల్లోలం మరియు తలనొప్పి వంటి లక్షణాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. విత్తనాలు హార్మోన్ల రుగ్మతలను నియంత్రించడంలో సహాయపడే ప్రోటీన్‌ను శరీరానికి అందిస్తాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు ; పొద్దుతిరుగుడు విత్తనాలను తినటం వల్ల ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ లక్షణాలను ఎదుర్కోవటానికి సహాయపడే విటమిన్ E ని అందిస్తాయి. దీనితో పాటు, సెలీనియం, ఫైబర్ మరియు ప్రోటీన్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. పిసిఓఎస్ సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
అవిసె గింజలు ; అవిసె గింజలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , లిగ్నన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అదనపు ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాదు, అవిసె గింజలు అండోత్సర్గాన్ని మెరుగుపరచడంలో, రొమ్ము నొప్పి , తిమ్మిరి వంటి సాధారణ లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
చియా విత్తనాలు ; ఆహారంలో చియా విత్తనాలను తీసుకోవటం ద్వారా గింజలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులు, మూడ్ స్వింగ్స్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్ నివారణలో ఇవి సహాయపడతాయి. చియా విత్తనాలు పీరియడ్స్ క్రమబద్ధీకరించడంలో కూడా సహాయపడతాయి. చియా విత్తనాలలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ పుపుష్కలంగా ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గుమ్మడికాయ గింజలు ; గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫాస్పరస్, కాపర్, ఐరన్, జింక్, ప్రొటీన్, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,విటమిన్ ఎతో నిండి ఉంటాయి. పిసిఒఎస్‌తో బాధపడుతున్న మహిళలకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ విత్తనాలను తీసుకుంటే మెనోపాజ్ తర్వాత కూడా బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి.