Good Cholesterol
Good Cholesterol : శరీరంలోని ఇతర అవయవాల్లో లాగానే కాలేయంలో కొవ్వు నిల్వలు ఏర్పడతాయి. కాలేయంలో అధిక కొవ్వులు ఏర్పడితే మాత్రం అది దాని పనితీరుకే ముప్పుగా మారుతుంది. కాలేయం అధిక మోతాదులో పేరుకున్న కొవ్వు నిల్వలు చివరకు తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయి. దీనినే ఫ్యాటీ లివర్ డిసీజ్ గా వైద్యపరిభాషలో చెప్తుంటారు. మద్యం వంటి అలవాట్లతో సంబంధం లేకుండానే ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువు, మధుమేహం, మద్యం సేవించే వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.
అయితే అన్ని కొవ్వులు కాలేయానికి చెడ్డవేమి కావని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. హెచ్ డీఎల్3 కొలెస్ట్రాల్ వల్ల కాలేయానికి మేలు కలుగుతున్నట్లు తేలింది. ఈ తరహా కొలెస్ట్రాల్ పేగుల్లో నుండి పుట్టుకు వస్తుంది. పేగుల్లో ద్వారా ఉత్పత్తి అయ్యే బ్యాక్టీరియా కారణంగా కాలేయం వాపుకు గురికాకుండా ఈ హెడ్ డీ ఎల్ 3 కొలెస్ట్రాల్ అడ్గుకుంటుంది. గుండెజబ్బుల్లాగానే కాలేయ వ్యాధి కూడా దీర్ఘకాలికమైన జబ్బు. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అందుకే కాలేయానికి మేలు చేసే హెచ్ డీఎల్ 3మోతాదులను పెంచుకునేందుకు అవసరమైన ఆహారాలను తీసుకోవటం మంచిది. ఇందుకుగాను కొవ్వులు, నూనె పదార్ధాలు తగ్గించి తీసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. అసంతృప్త కొవ్వులతో కూడిన చేపలు, అవిసెగింజలు, అక్రోట్లు, పండ్లు , కూరగాయలు, బాదం వంటి వాటిని తీసుకోవటం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెంచుకునేందుకు వీలుంటుంది. రోజు వారి వ్యాయామం ద్వారా సైతం మంచి కొవ్వులు పెరుగుతాయి. తద్వారా కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.