కరోనా దెబ్బకు స్మోకింగ్ మానేసిన పోగరాయుళ్లు!

  • Publish Date - July 15, 2020 / 05:50 PM IST

million smokers quit కరోనా దెబ్బకు ఎంతటివారైనా తోక ముడవాల్సిందే.. పోగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. క్యాన్సర్‌కు దారితీస్తుంది.. స్మోకింగ్ అలవాటు మానుకోండిరా బాబూ అంటూ నెత్తి నోరు మొత్తుకుని హెచ్చరించినా వినని పోగ రాయుళ్లు.. కరోనా దెబ్బకు వెంటనే స్మోకింగ్ మానేశారు. వందలు కాదు.. వేల మంది కాదు.. ఒక మిలియన్ మంది (పది లక్షలు) మందిని కరోనా మార్చేసింది.

కరోనా భయంతో స్మోకింగ్ అంటేనే హడలిపోతున్నారు. కరోనా మహమ్మారి కాలంలో కొన్నాళ్లు స్మోకింగ్ చేయకపోవమే మంచిదని డిసైడ్ అయ్యారంట.. ఇండియాతో పాటు యూకేలో మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి నుంచి ఒక మిలియన్ మంది పోగ రాయుళ్లు.. పోగ తాగడాన్ని వదిలేసుకున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి.

charity Action on Smoking Health (ASH) సర్వే ప్రకారం.. మరో 4,40వేల మంది పోగ రాయుళ్లు తమ అలవాటు మానుకునేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. పెద్దల కంటే యువకులే అత్యధిక సంఖ్యలో స్మోకింగ్ మానుకున్నారని ASH, University College London (UCL) తమ రీసెర్చ్‌లో గుర్తించారు.

50 ఏళ్ల వయస్సు వారిలో 7 శాతం మంది స్మోకింగ్ మానేస్తే.. 16ఏళ్ల వయస్సు నుంచి 29 ఏళ్ల వయస్సు గల స్మోకర్లు దాదాపు 17శాతం మధ్య ఉన్నట్టు సర్వేలో తేలింది. స్మోకింగ్ మానేసిన వారి సంఖ్యను గుర్తించేందుకు ఏప్రిల్ మధ్య నెల నుంచి జూన్ ఆఖరి వరకు 10వేల మందికిపైగా మానేశారని అంచనా వేసింది.

కోవిడ్-19 లక్షణాలు తీవ్రంగా స్మోకింగ్ చేసేవారిలోనే ఎక్కువగా ఉంటాయని యూకేలోని ప్రభుత్వం హెచ్చరించింది. దాంతో అప్పటినుంచి యూకేలోని 7.4 మిలియన్ల మంది స్మోకర్లు తమ స్మోకింగ్ అలవాట్లను మానుకోవాలని నిర్ణయించుకున్నారని సర్వే తెలిపింది.
బ్రిటన్‌లో కరోనా తీవ్రత పెరిగినప్పటినుంచి మిలియన్ మంది స్మోకర్లు తమ అలవాటును మానుకున్నారని ASH చీఫ్ ఎగ్జిక్యూటీవ్ Deborah Arnott చెప్పారు. అయితే.. స్మోకింగ్ మానేసిన వారి సంఖ్య… స్మోకింగ్ చేసేవారితో పోలిస్తే.. దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉందని ఆమె అన్నారు.

West YorkShire లోని Castleford‌కు చెందిన Lee తన 18 ఏటా నుంచే స్మోకింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఎప్పుడు అయితే కరోనా వైరస్ తీవ్రత పెరిగిందో అప్పటి నుంచి స్మోకింగ్ మానేసినట్టు తెలిపారు. కరోనా పరిస్థితుల్లో స్మోకింగ్ మానేయడం ఆరోగ్యపరంగా చాలా మంచిదని అంటున్నారు.